క్లారిటీ ఇచ్చిన రాఖీ సావంత్.. అవును చేసుకున్నా అంటూ!
సెక్సీతార, బాలీవుడ్ నటి రాఖీ సావంత్ పెళ్లి చేసుకుందంటూ గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ హోటల్‌లో పెళ్లి కుమార్తె గెటప్‌లో ఆమె కనిపించడంతో రాఖీ.. రహస్యంగా వివాహం చేసుకుందంటూ ప్రచారం జరిగింది. ఈ మేరకు పలు ఫొటోలు బయటకొచ్చినా కూడా వరుడు కనిపించక పోవడంతో ఆమె పెళ్లి వార్తపై అనుమానాలు రేకెత్తాయి. ఈ పరిణామాల నడుమ తాజాగా తన పెళ్లికి సంబందించిన పూర్తి వివారాలు తెలుపుతూ క్లారిటీ ఇచ్చేసింది రాఖీ సావంత్.
తన పెళ్లి వార్తలపై స్పందించిన రాఖీ సావంత్ తాను ఎన్నారైను వివాహం చేసుకున్నట్లుగా వెల్లడించింది. యూకేలో ఉన్న ఎన్నారై బిజినెస్ మెన్ రితీశ్ అనే యువకుడిని తాను పెళ్లాడానని రాఖీ సావంత్ వెల్లడించింది. కేవలం అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితుల నడుమ తమ వివాహ వేడుక జరిగిందని తెలిపింది. పెళ్లి కాగానే ఆయన యూకే వెళ్లిపోయాడని, తనకు కూడా వీసా వచ్చిన వెంటనే యూకే వెళ్లి అక్కడే స్థిరపడతాం అని చెప్పింది రాఖీ సావంత్.
టీవీ షోలను నిర్మించాలనేది తన కల అని.. పెళ్లి తర్వాత అది నెరవేర బోతోందని ఆమె తెలిపింది. తనకు మంచి భర్తను ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు అని చెప్పింది రాఖీ.

ఇక ఈ పెళ్ళికి ముందు జరిగిన పరిణామాల గురించి మాట్లాడిన ఆమె.. తనకు, తన భర్త ప్రభు చావ్లాకు మొదట ఓ ఇంటర్వ్యూ ద్వారా ముఖాముఖీ జరిగిందని, ఆ తర్వాత వాట్స్ యాప్ ద్వారా ప్రభు చావ్లా మెసేజ్ పంపండం, ఆ వెంటనే ఇద్దరం మంచి స్నేహితులుగా మారటం జరిగిందని రాఖీ సావంత్ తెలిపింది. కాకపోతే ఇదంతా ఏడాదిన్నర క్రితం జరిగిందని తెలిపింది. సినీ పరిశ్రమతో తన అనుబంధం ఇకపై కూడా కొనసాగుతుందని ఆమె చెప్పడం విశేషం. మరో ఏడాదిలో పిల్లల్ని కూడా కంటానని ఆమె చెప్పింది.


Click it and Unblock the Notifications











