రామ్ చరణ్ ని గిల్లుతున్న రాఖీ సావంత్
రామ్ చరణ్, చిరంజీవి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు అవకాశం ఇస్తే అదరకొడతానని, వేరే ఆలోచన లేకుండా ఓకే చేస్తానని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది. హిందీలో పెద్దగా ఆఫర్స్ లేని ఆమె కన్ను తెలుగు పరిశ్రమపై పడింది.అందుకే ఇక్కడ రామ్ చరణ్ వంటి స్టార్ సినిమాల్లో అయితే గుర్తింపు త్వరగా వస్తుందని ఆమె అలా ఓ రాయి వేసింది.అలాగే నాలుగు రోజుల క్రితం రాఖీ సావంత్...తన ఆఫర్స్ అన్నీ పేరున్న స్టార్ హీరోయిన్స్ కొట్టుకుపోతున్నారని,ఐటం గర్ల్స్ కి,హీరోయిన్స్ కి తేడా లేకుండా పోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే... బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు విడిగా, ఐటం గర్ల్స్ విడిగా ఉండేవారు. ఇప్పుడా తేడా లేకుండా పోయింది. హీరోయిన్స్ అంతా ఐటం సాంగ్స్ చేయటానికి సై అంటున్నారు. అందులోనూ నిర్మాతలు కూడా హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు.
మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.ఐటం గర్ల్ గా సినిమాల్లోకి వచ్చిన తమకు..హీరోయిన్స్ పాత్రలు రావని, కానీ హీరోయిన్స్ మాత్రం తమ పాత్రలను లాగేసుకుంటున్నారని ఏడుపు మొహంతో చెప్పుకొచ్చింది.ఇప్పుడిలా సెన్సార్ పై మండిపడుతోంది. ఇక ఈ దేశీబాయ్స్ చిత్రంలో అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం,దీపికా పదుకోని,చిత్రాంగద సింగ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.దర్శకుడు రోహిత్ ధావన్ కిదే తొలి చిత్రం.రోహిత్ ధావన్ మరెవరో కాదు గతంలో ఎన్నో కామిడీ చిత్రాలు డైరక్ట్ చేసిన డేవిడ్ ధావన్ తనయడు. ఈ చిత్రం కూడా ఓ యాక్షన్ కామిడినే కావటం విశేషం.మ్ారి ఆమె మెర ఆలకించి రామ్ చరణ్ ఆమెకు ఆఫర్ ఇస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











