షాక్ : ఆడియో వేడుకలో డైరెక్టర్ చెంప చెల్లుమనిపించింది
ముంబై: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఐటం గర్ల్, నటి రాఖీ సావంత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి ఆమె ఫ్రెండు చేసిన పని వల్ల ఆమె హాట్ టాపిక్ అయింది. రాఖీ సావంత్ స్నేహితురాలు ఒకరు బాలీవుడ్ దర్శకుడు సచేంద్ర శర్మ చెంప చెల్లుమనిపించింది.
‘ముంబై కెన్ డాన్స్ సాలా' అనే సినిమా ఆడియో వేడుక నిన్న(గురువారం) రాత్రి ముంబైలో జరిగింది. ఆడియో వేడుక జరుగుతుండగా ఉన్నట్టుండి...మనిషా అనే అమ్మాయి స్టేజీపైకి దూసుకొచ్చింది. దర్శకుడితో వాగ్వివాదానికి దిగింది. సినిమా నుండి రాఖీ సావంత్ సాంగ్ ఎందుకు తీసేసారు అంటూ గొడవ పడింది. మాటలతో ఆగకుండా దర్శకుడి చెంప చెల్లుమనిపించింది. ఈ సంఘటనతో అంతా షాక్ అయ్యారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
వీడియో కోసం ఇమేజ్ పై క్లిక్ చేయండి
రిపోర్టతో మనీసా మాట్లాడుతూ....దర్శకుడిపై కాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసింది. సినిమా అవకాశం ఇవ్వాలని అడిగితే లైంగిక పరమైన కోరికలు కోరారని ఆరోపించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దర్శకుడిపై ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతరం దర్శకుడి భార్య మధు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు. చీప్ పబ్లిసిటీ కోసమే రాఖీ సావంత్, ఆమె ఫ్రెండ్ మనీషా ఈ డ్రామాకు తెరతీసారని, అన్యాయంగా తన భర్తపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications












