సినిమాల్లో హాట్... ఎలక్షన్స్ లో మాత్రం 15 ఓట్లు
ముంబయి: బాలీవుడ్ నటి...నర్తకి రాఖీ సావంత్ లోకసభ ఎన్నికల్లో తనే స్వయంగా పార్టీ పెట్టి నిలబడిన సంగతి తెలిసిందే. పచ్చి మెరపకాయ గుర్తుతో ప్రచారం చేసిన ఆమెకు మొదటి మూడు రౌండ్స్ కేవలం 15 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆమెను సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో జోక్స్ తో ఆడుకున్నారు.
మెట్రో నగరాల్లో మహిళలకు కట్టుదిట్టమైన రక్షణ...భద్రత కల్పనే నినాదంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రచారంలో చెప్పుకొచ్చింది. కానీ ఫలితం లేకుండా పోయింది. తను ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం తన దగ్గర ఓటర్లుకు పంచిపెట్టేటంత డబ్బు లేకపోవటమే అని తేల్చి చెప్పింది.

అలాగే తాను తన పార్టికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఆమె పెట్టిన పార్టికి ఆమే రాజీనామా చేయటమేంటిని ఆశ్చర్యపోయారు. సర్లే ఆమె ఇక సినిమాల్లో మళ్లీ ఐటం డాన్స్ లు చేస్తుందంటూ అభిమానులు సంతోషపడుతున్నారు.
rakhi sawant bollywood bjp narendra modi lok sabha election 2014 రాఖీ సావంత్ బాలీవుడ్ బిజెపి నరేంద్ర మోడీ లోకసభ ఎన్నికలు 2014


Click it and Unblock the Notifications