ఆ స్టార్ హీరోని హీరోయిన్స్ అందుకే వాడుకుంటున్నారు
ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్శీ ఉంటేనే గానీ నిద్రపట్టని రాఖీ సావంత్ తాజాగా సల్మాన్ ఖాన్ గురించి హాట్ గా కామెంట్ చేసింది. ఆమె ముంబై మిర్రర్ కి ఇచ్చిన ఇంటర్వూలో...సల్మాన్ ఖాన్ ని బాలీవుడ్ హీరోయిన్స్ వాడుకుని వదిలేస్తున్నారని కామెంట్ చేసింది. ఆమె మాటల్లో ...అమ్మాయిలంతా సల్మాన్ దగ్గరకు తమ కెరీర్స్ కోసం వస్తున్నారు..వారి పని పూర్తి కాగానే అతన్ని వదిలేస్తున్నారు అని భాధపడింది. అలాగే కత్రినా కైఫ్ తో సల్మాన్ ఖాన్ సంభందం వదులుకోదలుచుకోలేదని, తిరిగి తమ విభేధాలు విడిచి కలుస్తారని ఆశిస్తున్నానని అంది. అలాగే తాను ఏం మాట్లాడినా మీడియా వారు ఎందుకు వివాదాస్పందంగా చేస్తున్నారో అర్ధం కావటంలేదని అంటూ ప్రశ్నించింది. అదీ సంగతి.
రాఖీ సావంత్ సల్మాన్ ఖాన్ దబాంగ్ ముంబై మిర్రర్ కత్రినా కైఫ్ ఐశ్వర్య రాయ్ rakhi sawant salman khan dabang mumbai mirror katrina kaif drona


Click it and Unblock the Notifications