హీరోయిన్స్ దెబ్బకొట్టారని మీడియాతో ఐటం బాంబ్
బాలీవుడ్ ఐటం బాంబ్ రాఖీ సావంత్ కి ఇప్పుడు ఆఫర్స్ కరువు అయ్యిపోయాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండి పరిశ్రమ దృష్టిని ఆకర్షించి అవకాశాలు పొందే ఆమె మీడియా ముందు రీసెంట్ గా ఏడ్చినంత పనిచేసింది. తన ఆఫర్స్ అన్నీ పేరున్న స్టార్ హీరోయిన్స్ కొట్టుకుపోతున్నారని,ఐటం గర్ల్స్ కి,హీరోయిన్స్ కి తేడా లేకుండా పోయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే... బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్లు విడిగా, ఐటం గర్ల్స్ విడిగా ఉండేవారు. ఇప్పుడా తేడా లేకుండా పోయింది. హీరోయిన్స్ అంతా ఐటం సాంగ్స్ చేయటానికి సై అంటున్నారు. అందులోనూ నిర్మాతలు కూడా హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది అంటున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.ఐటం గర్ల్ గా సినిమాల్లోకి వచ్చిన తమకు..హీరోయిన్స్ పాత్రలు రావని, కానీ హీరోయిన్స్ మాత్రం తమ పాత్రలను లాగేసుకుంటున్నారని ఏడుపు మొహంతో చెప్పుకొచ్చింది.
ఈ ట్రెండ్ తీస్ మార్ ఖాన్ లో షీలాకీ జవానీ అంటూ కత్రినా చేసినప్పటి నుంచి ఎక్కువై పోయిందని అంటోంది. అయినా తనకు తనపై నమ్మకం ఉందని,ప్రస్తుతం తాను లూట్ సినిమాలో ఐటం సాంగ్ చేస్తున్నానని, దాంతో తనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని, ఈ సాంగ్ తో మున్నీ సాంగ్ లో మలైకా కు ఎంత పేరు వచ్చిందో తనకు అంత ఇమేజ్ వస్తుందన్న నమ్మకం ఉందని అంది రాఖీ. ఇది విన్న వారంతా పాపం రాఖీ సావంత్ అంటున్నారు.నిజమే కదా..హీరోయిన్సే..ఐటం సాంగ్స్ చేసేస్తే ఇంక వీళ్లేం చేయాలి. ముమాయిత్ ఖాన్ లా రెస్ట్ తీసుకోవటం తప్పించి. తెలుగులోనూ చార్మి, అనూష్క వంటి వారు సైతం ఐటం సాంగ్స్ కు ఎగబడి ముమైత్ నోటి వద్ద కూడు లాగేసారు.


Click it and Unblock the Notifications











