ఐటం లేడీ రాజకీయ పార్టీ షురూ, గుర్తు ‘మిర్చి’(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ ఐటెం భామ రాఖీ సావంత్ రాజకీయ పార్టీ స్థాపించిన మరీ ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన పార్టీ పేరు రాష్ట్రీయ ఆమ్ పార్టీ(రాప్). ఇటీవలే ముంబైలో తన పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. తన వ్యక్తిత్వానికి అనుగుణంగానే తన పార్టీ గుర్తును పచ్చి మిరపకాయగా నిర్ణయించారు. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నుంచి లోకసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అంతేగాక తాను ప్రస్తుతం అనాథ రాజకీయ నాయకురాలిని లేదా స్వతంత్ర అభ్యర్థిని అని చెప్పుకున్నారు. ప్రస్తుతం నేను నా సొంత పార్టీని కలిగి ఉన్నానని తెలిపారు. తాను తన పార్టీకి ఉపాధ్యక్షురాలినని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని పోలివుంది కదా అని మీడియా ప్రశ్నించగా.. తన పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తేడా ఉంటుందని చెప్పారు.

తాను త్వరలోనే తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తానని రాఖీ సావంత్ తెలిపారు. తాను పేద ప్రజల కోసం, మహిళల భద్రత కోసం కృషి చేస్తానని చెప్పారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే తన చివరి రక్తంబొట్టు పోయే వరకూ పేద ప్రజల అభివృద్ధికి కోసం పాటుపడతానని తెలిపారు. కాగా, రాఖీ సావంత్ పార్టీకి ఆఫీస్ బేరర్లుగా, ఫండ్ రైజర్లుగా స్థానిక వ్యాపారులే ఉండటం గమనార్హం. ఆ వ్యాపారుల భార్యలు పార్టీ మహిళా విభాగానికి నాయకత్వం వహించనున్నట్లు తెలిసింది.

బిజేపీకి మద్దతు

బిజేపీకి మద్దతు

భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వస్తే ఆ పార్టీ తరపునే పోటీ చేస్తానని చెప్పిన రాఖీ సావంత్ ఆపార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సొంతంగా పార్టీని స్థాపించారు. ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. అయితే తాను బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆమె ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

వినూత్న ప్రచారం

వినూత్న ప్రచారం

ఈ సందర్భంగా తనదైన రీతిలో వాగ్ధాలు గుప్పిస్తోంది. తనకు ఓటు వేసి గెలిపిస్తే చాలా కష్టపడి ప్రజా సేవ చేస్తానని అటోంది. మఖ్యంగా తన నియోజకవర్గంలో మంచి రోడ్లు వేయిస్తానని, కత్రినా కైఫ్ నడుముకంటే నునుపైన రోడ్లు వేయిస్తానని చెబుతోంది.

జీవితాన్ని ధార పోస్తానని వాగ్ధానాలు

జీవితాన్ని ధార పోస్తానని వాగ్ధానాలు

ఇక రాఖీ సావంత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమోషన్‌గా ప్రవర్తిస్తోంది. ‘నన్ను గెలిపిస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని, ఎంపీగా గెలిస్తే ప్రజల కోసం తన జీవితాన్ని ధార పోస్తానని' చెబుతోంది.

మిర్చి గుర్తు

మిర్చి గుర్తు

తన వ్యక్తిత్వానికి అనుగుణంగానే తన పార్టీ గుర్తును పచ్చి మిరపకాయగా నిర్ణయించారు. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నుంచి లోకసభ ఎన్నికలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X