సైఫ్-కరీనా ఎఫైర్‌పై కుళ్లు జోకులు
బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మెనిగి తేలుతున్న సంగతి తెలిసిందే. సహజీవనం చేస్తున్న ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే వీళ్ల రిలేషన్ షిప్‌పై కుళ్లు జోకులు పేలుస్తోంది బాలీవుడ్ ఐటం బాబు రాఖీ సావంత్. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాఖీ మాట్లాడుతూ.....సైఫ్ చాలా ముసలోడని, అతని పిల్లలు కూడా ఉన్నారని, కరీనాకు అతడు అస్సలు మ్యాచ్ కాలేదని అంటోంది. అంతటితో ఆగకుండా బెబోకు తన మాజీ బాయ్ ఫ్రెండ్ షాహిద్ కపూర్ అయితేనే పర్ ఫెక్టుగా సెట్ అవుతాడు వ్యాఖ్యానించింది.
మీడియాలో పబ్లిసిటీ పెంచుకోవడానికి రాఖీ ఇలాంటి కామెంట్లు చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. వీణా మాలిక్, కత్రినా కైఫ్ ఇలా చాలా మందిపై తన నోటి దురుసు ప్రదర్శించింది రాఖీ. అందుకే ఆమెను నోరు బురదగుంట అంటుంటారు చాలా మంది. బురదలో రాయేస్తే మళ్లీ తమపైనే బురద పడుతుందని ఎవ్వరూ ఆమె కామెంట్స్ ను కనీసం పట్టించుకోవడం లేదు. అయితే రాఖీ మాత్రం పబ్లిసిటీ కోసం ఇలా రెచ్చ పోతూనే ఉంది.


Click it and Unblock the Notifications











