twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినా నడుముకంటే నునుపైన రోడ్లు వేయిస్తుందట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఈ ఎన్నికల్లో వాయువ్య ముంబై నుండి లోక్ సభకు పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తనదైన రీతిలో వాగ్ధాలు గుప్పిస్తోంది. తనకు ఓటు వేసి గెలిపిస్తే చాలా కష్టపడి ప్రజా సేవ చేస్తానని అటోంది. మఖ్యంగా తన నియోజకవర్గంలో మంచి రోడ్లు వేయిస్తానని, కత్రినా కైఫ్ నడుముకంటే నునుపైన రోడ్లు వేయిస్తానని చెబుతోంది.

    అయితే రాఖీ సావంత్ వ్యాఖ్యలను కత్రినా కైఫ్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం పబ్లిసిటీ కోసమే రాఖీ సావంత్ ఇలా చేస్తుందని ఆమె భావిస్తోంది. ఇక రాఖీ సావంత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమోషన్‌గా ప్రవర్తిస్తోంది. 'నన్ను గెలిపిస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని, ఎంపీగా గెలిస్తే ప్రజల కోసం తన జీవితాన్ని ధార పోస్తానని' చెబుతోంది.

     Rakhi Sawant Makes Funny Remarks On Katrina

    'దేశంలోని మహిళలకు భద్రత కల్పించడం తన పొలిటికల్ ఎజెండాలోని ముఖ్యమైన అంశమని, మహిళలు తలెత్తుకుని జీవించే పరిస్థితులు రావాలని, వారు ఎలాంటి భయం లేకుండా పని చేసుకునే రోజులు రావాలని' రాఖీ సావంత్ రాజకీయ ప్రసంగాలు దంచేస్తోంది.

    రాఖీ సావంత్ ఈ ఎన్నికల్లో సొంత పార్టీ స్థాపించి మరీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. . తన పార్టీ పేరు రాష్ట్రీయ ఆమ్ ఆద్మీ పార్టీ(రాప్). తన వ్యక్తిత్వానికి అనుగుణంగానే తన పార్టీ గుర్తును పచ్చి మిరపకాయగా నిర్ణయించినట్లు రాఖీ తెలిపారు. అంతేగాక తాను ప్రస్తుతం అనాథ రాజకీయ నాయకురాలిని లేదా స్వతంత్ర అభ్యర్థిని అని చెప్పుకున్నారు. ప్రస్తుతం నేను నా సొంత పార్టీని కలిగి ఉన్నానని తెలిపారు. తాను తన పార్టీకి ఉపాధ్యక్షురాలినని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని పోలివుంది కదా అని మీడియా ప్రశ్నించగా.. తన పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తేడా ఉంటుందని చెప్పారు.

    English summary
    Rakhi Sawant, who fights Lok Sabha elections from North West Mumbai seat, vows that she will work hard for people who would vote her. To add more drama to her speech, she said, "I can guarantee that the roads of my constituency would be smoother than Katrina Kaif's waist."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X