»   » డబ్బుకోసం సెక్స్ సినిమాలు, ఆమె భారతీయ సంస్కృతికి వారసురాలు కాదు... రాఖీ సావంత్ గురివింద మాటలు

డబ్బుకోసం సెక్స్ సినిమాలు, ఆమె భారతీయ సంస్కృతికి వారసురాలు కాదు... రాఖీ సావంత్ గురివింద మాటలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే తారగా పేరున్న రాఖీ సావంత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఆ మధ్య నరేంద్రమోడీ ఫోటోలున్న డ్రెస్ ధరించి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురయ్యాక కూడా ఆమె వైఖరి మారలేదు.అసలు అవకాశాలే లేక పోవటం, ఇదివరకున్నంత పబ్లిసిటీ రాకపోవటం తో ఇక వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలో, చేష్టలో చేస్తూ వారతల్లో నిలిచే ప్రయత్నాల్లో ఉంది. అయితే సామెత చెప్పినట్టు ఇక్కడ మ్యాటర్ లేకపోవటం తో చాన్సులు లేవన్న విషయం ఒప్పుకోలేక సన్నీ లియోన్ మీద పడుతోంది... సన్నీ కి వచ్చే అవకాశాలన్నీ తనకు రావాల్సినవనీ అయితే సన్నీ వాటిని ఎగరేసుకుపోతోందీ అంటూ సన్నీ మీద పీకలదాకా కోపం పెంచుకొని ఎప్పుడు చాన్స్ దొరికినా సన్నీ మీద విరుచుకు పడుతోంది.

ఆ మధ్య ఒకసారి 'దమ్ముంటే నాతో చాలెంజ్ చేయ్. ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. ఎవరు బెటరో అందరికీ తెలిసి పోతుంది' అంటూ సన్నీ లియోన్‌కు సవాల్ విసిరింది రాకీ సావంత్. మరి రాఖీ సావంత్ సవాలుకు సన్నీ లియోన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్ వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.ఈ విషయం తెలుసుకున్న సన్నీ మాత్రం 'నా పాపులారిటీ చూసి, ఓర్వలేకే నాపై కొందరు కామెంట్ చేస్తున్నారు, అలాగైనా వారికి పబ్లిసిటీ వస్తుందని ఆశపడుతున్నారు. వారి సరదాపై నేను నీళ్లు చల్లలేను.' అంటూ తనదైన స్టైల్ లో కూల్‌గా సన్నీ సమాధానమిచ్చింది. అదక్కడితో ముగిసిందనుకుంటే తాజాగా మరో సారి సన్నీ జాతీయతని ఉద్దేశించి విమర్శించింది...

 రాఖీ సావంత్:

రాఖీ సావంత్:


పోర్న్ స్టార్ సన్నీలియోన్‌పై బాలీవుడ్ ఐటెంబాంబ్ రాఖీ సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడింది. సన్నీలియోన్ రాకతో రాఖీ సావంత్‌కు అవకాశాలు తగ్గిపోయాయనే అక్కసు కారణంగా సన్నీ అంటే ఆమెకు పడదని ఓ రూమర్ ఉన్న నేపథ్యంలో.. రాఖీ మాత్రం సన్నీని ఏదోక విధంగా ఇండియా నుంచి పంపేయాలని కాచుకుకూర్చుంది.

 భారతీయ సంస్కృతీ:

భారతీయ సంస్కృతీ:


రాఖీ సావంత్ గతేడాది ఓ సందర్భంలో సన్నీ లియోన్ గురించి మాట్లాడుతూ, ఓ పోర్న్ స్టార్‌తో పోటీపడేందుకు తాను పోర్న్ స్టార్‌గా మారనని తాను భారతీయ వనితననీ తన దేశ సంస్కృతికి వ్యతిరేకంగా ఉండననీ వింత మాటలు చెప్పింది. చాలాకాలంగా సన్నీలియోన్‌తో రాఖీ సావంత్‌ 'పోటీ' పడ్తోంది.. పాపం ఈ పోటీలో కనీసం సన్నీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేక అవకాశాలను పొందలేక ఇప్పుడు "భారతీయ సంస్కృతీ" అంటూ కొత్త పాట అందుకుంది.

 మడోన్నా, జెన్నిఫరల్ లోపెజ్‌లతో:

మడోన్నా, జెన్నిఫరల్ లోపెజ్‌లతో:


గతం లో కూడా ఇదే విధంగా స్పందిస్తూ పోర్న్ సినిమాల్లో నటించి తాను అభిమానులను సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. అలా తనను ఇతరులతో పోల్చాలనుకుంటే మడోన్నా, జెన్నిఫరల్ లోపెజ్‌లతో పోల్చండని తన స్థాయి వారికి సమానం గా ఉంటుంది తప్ప సన్నీ అంత నీచమైన స్థితి తనది కాదు అంటూ తన అక్కసు వెళ్ళగక్కింది.

 ఓ వీడియో ఆల్భం షూటింగ్:

ఓ వీడియో ఆల్భం షూటింగ్:


తాను కూడా వారిలాగానే డాన్స్, నటన, రియాల్టీ షోల ద్వారా అభిమానులను సంపాదించుకున్నాను అంటూ రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. ఓ వీడియో ఆల్భం షూటింగ్ సందర్భంగా రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడింది. వీడియో ఆల్బమ్ సన్నీ లియోన్‌కు టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. ఈప్రశ్నకు చిర్రెత్తి పోయిన రాఖీ సావంత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

 సన్నీ లియోన్‌తో పోల్చవద్దు:

సన్నీ లియోన్‌తో పోల్చవద్దు:


'దయచేసి నన్ను సన్నీ లియోన్‌తో పోల్చవద్దు. నేను డాన్సింగ్, నటన, రియాల్టీ షో ద్వారా ఈ స్థాయికి చేరుకున్నాను. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాను. అంతే కానీ అడల్ట్ ఫిల్మ్స్‌లో నటించడం లేదా ఇంకేదైనా వల్గర్ పని చేయలేదు. మీరు ఈ విషయం అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను'' అని రాఖీ చెప్పింది.

 జెన్నిఫర్ లోపెజ్, మడోన్నా:

జెన్నిఫర్ లోపెజ్, మడోన్నా:


‘నేను చాలా గ్లామరస్...చాలా పై స్థాయిలో ఉన్నాను. మీరు నన్ను జెన్నిఫర్ లోపెజ్, మడోన్నా లాంటి వారితో కంపేర్ చేస్తే నేనేమీ ఫీల్ కాను' అంటూ మీడియా ప్రతినిధులకు ఝలక్ ఇచ్చింది. చాలమంది అప్పుదు అక్కడికక్కడే బాహాటంగానే నవ్వుకున్నారు కూడా. అసలు రాఖీ తనని తాను ఏమనుకుంటోంది... ఈమె సన్నీ కన్నా దారుణం అని ఎవరో గుంపునుంచి అరిచినా రాఖీ అదేం పట్టించుకోకుందా తాను చెప్పాల్సినవి చెప్తూనే ఉందిట.

బూతులతోనూ వీరంగం:

బూతులతోనూ వీరంగం:

'సన్నీలియోన్‌ ముమ్మాటికీ పోర్న్‌ స్టారే.. పోర్న్‌ స్టార్‌ కాకపోతే ఇంకేమిటి.? డబ్బు కోసం ఆమె పోర్న్‌ సినిమాల్లో నటించింది.. పోర్న్‌ స్టార్‌గా ఎదిగింది.. కాదని చెప్పమనండి..'' అంటూ ఆవేశంతో ఊగిపోయింది బాలీవుడ్‌ ఐటమ్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌. అసలు పట్టలేనంత కోపాన్ని మీడియా ముందు కోపంగానూ, కాస్త పక్కకు వెళ్ళి బూతులతోనూ వీరంగం వేసింది.

 భారతీయ స్త్రీ:

భారతీయ స్త్రీ:


సన్నీలియోన్‌ పోర్న్‌ స్టార్‌ అని తెలియనిదెవరికి.? అయితే అది ఆమె గతం. ప్రస్తుతానికి సన్నీలియోన్‌ బాలీవుడ్‌ నటి. అలాగని ఎవరన్నా అంటే రాఖీసావంత్‌ ఒప్పుకోవడంలేదు. ఎందుకు.? అంంటే, ఆమె పోర్న్‌స్టార్‌ గనుక పోర్న్‌ స్టార్‌ అనే పిలుస్తానంటోంది రాఖీ సావంత్‌. 'నేనేమీ డబ్బు కోసం నగ్నంగా నటించలేదు.. పోర్న్‌ సినిమాల్లో నటించలేదు.. భారతీయ స్త్రీ ఎవరూ కూడా ఆ పని చెయ్యదు..' అంటోన్న రాఖీ సావంత్‌, ఎప్పటికీ సన్నీలియోన్‌ భారతీయ స్త్రీ కాలేదని తెగేసి చెప్పింది.

 అంతకు మించే :

అంతకు మించే :


సన్నీలియోన్‌తో పోల్చలేంగానీ, రాఖీసావంత్‌ కూడా వెండితెరపై తక్కువేం చేయలేదు. ఇప్పుడు సన్నీలియోన్‌ ఏ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తోందో, అంతకు మించే ఒకప్పుడు రాఖీసావంత్‌ తెరపై గ్లామర్‌ షో చేసేసింది. ఇదే విషయాన్ని సన్నీలియోన్‌ ఓ సందర్భంలో ప్రస్తావించింది కూడా.

 వేచి చూడాల్సిందే:

వేచి చూడాల్సిందే:


'నా పాత ఇమేజ్‌ పట్టుకుని నా మీద విమర్శలు చేసేవాళ్ళకి పోర్న్‌ స్టార్‌ ఇమేజ్‌ సంపాదించడమెలాగో చేతకాదు..' అంటూ రాఖీ సావంత్‌కి గతంలోనే సన్నీలియోన్‌ కౌంటర్‌ ఇచ్చింది. మరి, తాజాగా రాఖీ సావంత్‌, తనను భారతీయ నారి కాదని అనడంపై సన్నీలియోన్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

 సన్నీ కంటే హాట్ సన్నివేశాల్లోనే:

సన్నీ కంటే హాట్ సన్నివేశాల్లోనే:


అంతా బాగానే ఉంది గానీ ఇవే మాటలని వేరే ఏ హీరోయిన్ అన్నా జనం కొంచమైనా పట్టించుకునే వారేమో గానీ "సన్నీ కంటే హాట్ సన్నివేశాల్లోనే ఇరగదీసింది రాఖీ, పబ్లిక్ ఫంక్షన్లలోనూ స్కర్ట్ లోపల కూడా కనిపించేలా కావాలనే టీవీ కెమెరాలకు చూపించిన రాఖీ ఇప్పుడు చెప్పే పత్తిత్తు కబుర్లకి బాలివుడ్ ముక్కున వేలేసుకుంటోంది.

English summary
bollywood item girl turned hot actress Rakhi sawant trolls Sunny Leone again. she says that Sunny is a porn star she should not be a Indian women like Rakhi sawant
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu