సర్కస్ లో పెట్టద్దు ప్లీజ్...రాఖీ సావంత్ అభ్యర్ధన
ఎప్పుడూ ఏదో ఒకటి చేసి వివాదంలో ఇరుక్కునే సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ రీసెంట్ గా ఈ సారి తన క్రేజ్ ని ఓ మంచి కార్యక్రమానికి ఉపయోగించింది. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పీటా)తో కలిసి ఆమె పులి వేషధారణలో కొత్త యాడ్ ను ఇటీవలే చేశారు. అందులో భాగంగా ఆమె...'జంతువులకు సర్కస్ లలో కనీస సౌకర్యాలు ఉండట్లేదు. వాటికి సర్కస్ లకు తరలించకుండా కాపాడండి అంది. అలాగే జనాల ఆనందం కోసం జంతువులు చేత రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. ఆ విన్యాసాలను చేయించడం కోసం జంతువులను సర్కస్ నిర్వాహకులు నానావిధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మనకి పైకి కనిపించే వెలుగులు వాటి జీవితాల్లో ఉండవు. వాటికి నిజమైన స్వేచ్ఛ లభించదు. అందుకే వాటిని అక్కడి నుంచి తరలించి, సక్రమమైన మార్గంలో సంరక్షించడానికి అందరూ కృషిచేయాలి అని రాఖీ చెప్తోంది. ఇంతకుముందు ఈ తరహా ప్రచారాన్ని లారా దత్తా, శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, సెలీనా జైట్లీ చేసారు.


Click it and Unblock the Notifications











