రాఖీ సావంత్‌కు కోర్టు నోటీసులు, వీణా మాలిక్ కుట్ర!
హైదరాబాద్: బాలీవుడ్ నటి వీణా మాలిక్‌కు పాకిస్థాన్ కోర్టు 26 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఓ టీవీ కార్యక్రమానికి సంబంధించి ఆమెకు ఈ శిక్ష పడింది. ఈ సంఘటన మరువక ముందే తాజాగా బాలీవుడ్ వివాదాస్పద ఐటం గర్ల్ రాఖీ సావంత్ కూడా ఇలాంటి వివాదంలో ఇరుక్కుంది.
ఆ మధ్య ఆమె ఓ టీవీ ఛానల్‌లో ‘స్వయంవర్' రియాల్టీ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. భారతీయ వివాహ సాంప్రదాయం అయిన స్వయంవర్‌ను కించపరిచేలా ప్రవర్తించిందని ఆమెకు మహారాష్ట్రలోని ఓ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. స్వయంవర్ కార్యక్రమం ద్వారా ఆమె ఇప్పటికి ఎవరినీ వివాహం చేసుకోకపోగా తన చేష్టలతో భారతీయుల మనోభావాలు దెబ్బతీస్తోంది' అని సదరు నోటీసుల్లో ఉంది.

అయితే ఈ నోటీసులపై రాఖీ సావంత్ తనదైన రీతిలో స్పందించారు. ఇదంతా పాకిస్థాన్ నటి వీణా మాలిక్ కుట్రే అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. స్వయంవర్ కార్యక్రమంలో నాకు మంచి పేరు వచ్చిందనే అసూయతో ఈ కుట్ర చేస్తోందని సమాధానం ఇచ్చింది. ఈ కేసు విషయంలో మీడియా అటెన్షన్ మొత్తం తనపై పడటంపై జీసెస్‌కు థాంక్స్ చెబుతున్నట్లు రాఖీ సావంత్ వెల్లడించింది.
కాగా...రాఖీ సావంత్‌కు కోర్టు నోటీసులు పంపడంపై రాహుల్ మహాజన్ స్పందిస్తూ ఆమె శిక్షింప బడాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు రాహుల్ మహాజన్ కూడా స్వయంవర్ కార్యక్రమం నిర్వహించి ఈ షో ద్వారా డింపీ గంగూలీని పెళ్లాడి, తర్వాత విడాకులు ఇచ్చారు. ‘రాఖీ సావంత్ ఇప్పటి వరకు ఎవరినీ స్వయంవర్ కార్యక్రమం ద్వారా పెళ్లాడలేదు. స్వయంవర్ కాన్సెప్టును కించపరిచేలా ప్రవర్తించింది. నేను ఇండియన్ కల్చర్‌ను గౌరవించి స్వయంవర్ నియమాల ప్రకారం డింపీని పెళ్లాడాను. కానీ రాఖీ సావంత్ అలాంటిదేమీ చేయలేదు. ఆమె తప్పకుండా శిక్షింపబడాల్సిందే' అని వ్యాఖ్యనించారు.


Click it and Unblock the Notifications











