సెక్స్ బాంబ్ కి 16మంది మగాళ్లు
ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వినూత్న టీవీ రియాల్టీ షో "రాఖీ సావంత్స్ స్వయంవర్" సోమవారం రాత్రి 9 గంటలకు ఎన్డీటీవీ ఇమాజిన్ ఛానెల్ లో లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాగే ఈ రియాల్టీ షోలోని మొదటి ఎపిసోడ్ లో, వరుడి వేటలో పడిన రాఖీని భార్యగా పొందడానికి పోటీ పడుతున్న 16 మంది యువకులు ఆమెను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. వీరిలో ఈలేశ్ మరో ఇద్దరికి రాఖీ సావంత్ తొలి ప్రేమకు కానుకలుగా రత్నాలతో పొదిగిన పతకాలను స్వహస్తాలతో అందించారు. ఇంకా జైపూర్ లోని ఫతేగడ్ కోటలో ప్రారంభమైన రాఖీ స్వయంవర్ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ రామ్ కపూర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ షో నిర్వహిస్తున్న రామ్ కపూర్ వరుడి ఎంపికలో రాఖీకి సాయపడుతూ మాట్లాడిన తీరు బాగుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..నా వివాహాన్ని నా అబిమానులందిరి ఓట్లుపై ఆధారపడి ఉంటుంది. అయినా నన్ను చేసుకునే అవాకాశం అభిమానులకు మిస్తున్నాను. అందుకే నేషనల్ టెలివిజన్ ద్వారా ముందుకొస్తున్నాను అంది. ఇక ఈ వివాహాన్ని ఎస్ ఓ ఎల్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్నారు. ఈ పోగ్రామ్ కి మంచి రేటింగ్ వస్తుందని యాడ్స్ కి లోటుండదని, బిగ్ బాస్ పోగ్రామ్ లా పేలుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











