విరుష్క నా కండోమ్ వాడండి.. ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి.. రాందేవ్ నువ్వు కూడా.. లేకపోతే ఎయిడ్స్.. రాఖీ

విరాట్, అనుష్క పెళ్లి ఇటలీలోని ఓ వైన్ యార్డులో చాలా నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరుష్కకు బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ షాకిచ్చింది. ఇంతకీ రాఖీ ఏం చేసిందంటే..

By Rajababu

దేశంలోనే పాపులర్ సెలబ్రిటీ దంపతులుగా మారిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విరాట్, అనుష్క పెళ్లి ఇటలీలోని ఓ వైన్ యార్డులో చాలా నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల విరుష్క ఢిల్లీలో మ్యారేజ్ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. త్వరలోనే ముంబైలో ఓ భారీ విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో విరుష్కకు బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ షాకిచ్చింది. ఇంతకీ రాఖీ ఏం చేసిందంటే..

విరుష్కకు కండోమ్ గిఫ్ట్

విరుష్కకు కండోమ్ గిఫ్ట్

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరు అద్భుతమైన దంపతులు. ఇప్పుడిప్పుడే వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. వారికి నేను కండోమ్స్ గిఫ్టుగా ఇవ్వాలనుకొంటున్నాను అని రాఖీ సావంత్ సంచలన ప్రకటన చేసింది.

అనుష్క ఫీడ్ బ్యాక్ చెప్పాలి

అనుష్క ఫీడ్ బ్యాక్ చెప్పాలి

ఎలాంటి ఇబ్బందిలేకుండా జీవితాన్ని సాగించడానికి కండోమ్స్ ఇవ్వాలనుకొంటున్నాను. నేను గిఫ్టుగా ఇచ్చే కండోమ్స్ వాడిన తర్వాత వాటివల్ల పొందిన అనుభూతి ఎలా ఉందో అనే విషయంపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అని రాఖీ సావంత్ అన్నారు.

గిఫ్ట్‌గా కండోమ్స్ ఎందుకంటే

గిఫ్ట్‌గా కండోమ్స్ ఎందుకంటే

కండోమ్స్ ఎందుకు ఇస్తున్నానంటే. నా ప్రచారం చేసే కండోమ్స్ చాలా స్పెషల్. మార్కెట్లో అనేక ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్న మొట్టమొదటి కండోమ్స్ అవే. వాటితో దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. వారి జీవితం సుఖంగా ఉండటానికి నేను సహాయం చేయాలనుకొంటున్నాను.

నేను చేసిన మంచిపని ఇదే

నేను చేసిన మంచిపని ఇదే

నా జీవితంలో నేను చేసిన మంచి పని కండోమ్స్ సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో నటించడం. నేను ప్రచారం చేసే కండోమ్స్ కంటే గొప్పగా ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయా అని సవాల్ విసురుతున్నాను.

రాందేవ్ బాబా కూడా

రాందేవ్ బాబా కూడా

అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్న రాందేవ్ బాబా కూడా కండోమ్స్ ఉత్పత్తుల రంగంలోకి రావాలి. ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్ తీసుకురావాలి అని రాఖీ సావంత్ సూచించారు.

కండోమ్ యాడ్ బ్యాన్ చేస్తారా?

కండోమ్ యాడ్ బ్యాన్ చేస్తారా?

బిపాసాబసు, సన్నీలియోన్ కండోమ్ యాడ్స్‌లో నటిస్తే ప్రభుత్వం సెన్సార్ విధించదు. రాఖీ సావంత్ కండోమ్స్ యాడ్‌లో నటిస్తే మాత్రం ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. వాటి ప్రకటనలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య రాకుండా నిషేధం విధిస్తుంది. వాళ్లు కండోమ్స్ యాడ్స్ చూడకుండా బ్యాన్ విధించడం సమంజసమా అని రాఖీ సావంత్ నిలదీసింది.

దేశంలోని అందరికీ ఎయిడ్స్

దేశంలోని అందరికీ ఎయిడ్స్

ఒకవేళ నేను ప్రచారం చేసే కండోమ్స్ ప్రకటన చూడకుంటే దేశంలో అందరికీ ఎయిడ్స్ వస్తుంది. రాత్రిపూట యాడ్స్ ప్రసారం చేస్తే పిల్లలకు కండోమ్స్ గురించి పిల్లలకు తెలియదు. భారతీయులందరికీ ఎయిడ్స్ తెప్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. పిల్లలు చూడకపోతే సెక్స్ గురించి ముందస్తు జాగ్రత్తలు ఎలా తెలుస్తాయి అని రాఖీ సావంత్ ఆందోళన వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X