ఎప్పుడూ ఏదో విషయంపై కాంట్రవర్శి స్టేట్ మెంట్స్ ఇస్తూ హెడ్ లైన్స్ లోకి ఎక్కే రాఖి సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను పెళ్ళి చేసుకుంటానంటూ ప్రకటించింది. ఈ విషయంమై మీడియా తో రజనీ చాలా ఉన్నతమైన వ్యక్తి. రజనీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ.. ఆయన ఇంకా యువకుడిగానే కనిపిస్తారు. ఎంతో స్టైలిష్‌గానూ ఉంటారు. ఆయన సమ్మతం తెలిపితే వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఆ మధ్యన చెప్పావు కదా అంటే... రజనీ, సల్మాన్‌లను ఒకేలా చూడరాదంటోది. ముఖ్యంగా సల్మాన్‌తో పెళ్లి చేసుకున్నప్పటికీ.. రజనీతో ఒకటి లేదా రెండేళ్ళ ఒప్పంద కాలపరిమితితో పెళ్లి చేసుకోవాలని ఆసక్తి చూపుతున్నట్టు ఆయన తెలిపారు.
Story first published: Thursday, December 11, 2008, 10:32 [IST]