twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిచ్చెనలా వాడుకున్నాడు

    By Staff
    |

    RakhiShawant
    బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ కి సీక్రెట్స్ అనేవి ఎప్పుడూ ఉండకండా జాగ్రత్తపడుతూంటుంది. తాజాగా తన భాయ్ ఫ్రెండ్ అభిషేక్ అవస్ధికి బై చెప్పింది. ఆ విషయాన్ని అందరి ఎదురుగా కడిగేస్తూ వివరించింది. చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగాకే ఆమె ఈ నిర్ణయానికొచ్చినట్లు మీడియా దగ్గర వివరించింది. ఆమె అతన్ని తన లొకండ్ వాల అపార్ట్ మెంట్ నుంచి బయిటకు తోసేసింది. తదనంతరం మాట్లాడుతూ...నా జీవితంలో పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంటే అది అభిషేక్ అంటూ కామెంట్ చేసింది.

    తను ప్రేమించే నాటికి ఉన్న అభిషేక్ కాదని ఇప్పుడు చాలా మారిపోయాడని అంటోంది. అతను సక్సెస్ లకు నన్ను నిచ్చెనలా వాడుకున్నాడు. ఇవాళ కాదన్నాడు. రేపు ఏమంటాడో నని బయిటకు పొమ్మన్నాను. అతను నన్ను అన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడు అయినా నేనెప్పుడూ ఆ క్రెడిట్ కోసం ఏమి అడగలేదు. ఇంతకు ముందు ఏమి కేరాఫ్ ఫ్లాట్ ఫాం లాంటి అతను ఈ రోజు ముంబయిలో సొంత ప్లాట్ కొనుక్కున్నాడు.జీవితంలో ఎంతో ఎదిగాడు. అతని ప్రతి స్టెప్ లోను నేనున్నాను. అయిందేదో అయింది. ఇంత చేసినందుకు నాదే తప్పు. నాకు అతనుతో రిలేషన్ అసలు వద్దు. అని తెగేసి చెప్పింది. ఇప్పుడు ఆమె మరో భాయ్ ప్రెండ్ కోసం వెయిట్ చేస్తోంది. త్వరలోనే అతను దొరకాలని ఆశిద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X