బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ ఇప్పుడు తెలుగులో కనిపించి తన అందాలతో కనువిందు చేయబోతోంది. నితిన్, ప్రియమణి జంటగా కరుణాకర్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ద్రోణ చిత్రంలో ఈ స్పెషల్ కనపడునుంది. రాజమౌళి వద్ద పనిచేసిన ఈ దర్శకుడు మొదటి సినిమాకే రాఖీ సావంత్ ఐటం సాంగ్ కావాలంటున్నాడంటే కథకి కమర్షియల్ హంగులు చేర్చటం బాగానే అబ్బాయని అంటున్నారు. మహారాజశ్రీ సినిమా నిర్మాత డియస్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మజిల్ పవర్ కన్నా మైండ్ పరవే మిన్న అని నమ్మే కుర్రాడుగా కనిపిస్తాడని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. అలాగే రాఖీ సావంత్ నృత్యం తమ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నాడు.