అభిషేక్ బచ్చన్ ట్వీట్ ఆధారంగా శ్రీకాంత్ కొత్త చిత్రం
శ్రీకాంత్ మాట్లాడుతూ "వంశీకృష్ణ చెప్పిన కథ వినగానే నా కెరీర్‌లో 'ఖడ్గం', 'ఆపరేషన్ దుర్యోధన' ఎలా ప్రత్యేకమైన చిత్రాలో అలాగే ఈ సినిమా కూడా ఓ ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయం కలిగింది'' అని చెప్పారు. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ "శ్రీకాంత్ కేరక్టర్ శక్తిమంతంగా, భావోద్వేగభరితంగా, సామాజిక బాధ్యతతో నడుస్తుంది'' అని తెలిపారు. క్రియేటివ్ హెడ్‌గా శ్రీనివాసరాజు పనిచేస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని కూడా వంశీకృష్ణ సమకూరుస్తున్నారు.
అలాగే చిత్రం ప్రేరణ కు చెందిన విషయం చెప్తూ... ''నా కూతురు స్వేచ్ఛగా, క్షేమంగా పెరిగి పెద్దదికావడానికి అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కనిపించడం లేదు.. అని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యల స్ఫూర్తితో తయారుచేసుకున్న కథ ఇది. వచ్చే నెల్లో చిత్రీకరణ మొదలుపెడతాము''అన్నారు.
ఈ చిత్రం తో పాటు శ్రీకాంత్ మరో చిత్రం ఒప్పుకున్నారు. శ్రీకాంత్‌ని 'దేవరాయ'గా తెరపై చూపించారు దర్శకుడు నానికృష్ణ. ఇప్పుడు మళ్లీ ఈ కలయికలో ఓ కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. అదే... 'నాటు కోడి'. నానికృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ...దర్శక నిర్మాత మాట్లాడుతూ ''ఈ ప్రపంచంలో ఉన్నదంతా చెడ్డవాళ్లే... అవకాశం లేక కొంతమంది చెడ్డవాళ్లు మంచివాళ్లుగా మిగిలిపోయారంతే అనే అంశంతో అల్లుకున్న కథ ఇది. లంచగొండి పోలీస్ అధికారి పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తారు. గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతుంది. యాక్షన్, వినోదం మేళవింపుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. జూన్ నుంచి పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ మొదలుపెడతాము''అన్నారు.


Click it and Unblock the Notifications












