జగపతి బాబు 'రక్ష' రక్షిస్తుందా?

అయితే ఫూంక్ సినిమా లో బడ్జెట్ లో తీయటం, వర్మ గుడ్ విల్ చిత్ర నిర్మాతలను బిజెనెస్ రీత్యా నిరాశపరచలేదు. వారు ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన ప్రపంచ భాషల్లోకి డబ్బింగ్ చేయటానికి ముంబయిలో ప్రయత్నం చేస్తున్నారు.మరి తెలుగులో వంశీకృష్ణ కిది మొదటి చిత్రం. అందులోనూ జగపతిబాబు భాక్సాఫీసు వద్ద పెద్దగా ఓపినింగ్స్ తెచ్చుకునే పరిస్దితి లేదు. దాంతో ఎవరి మ్యాజిక్ లేనీ ఈ సినిమా దర్సకుడు టాలెంట్,మౌత్ టాక్ పైనే ఆధారపడి ముందుకు వెళ్ళాలి.
అలాగే రక్ష చిత్రం కూడా తమిళం,మళయాళం,కన్నడ వంటి రీజనల్ లాంగ్వేజస్ లోకి డబ్బింగ్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇక జగపతి బాబు మాత్రం 'రక్ష'చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇంటర్వూలలో రక్ష సినిమాలో తెలుగు నేటివిటీకి తగ్గట్లు సెంటిమెంట్ కూడా కనిపిస్తుందని అందరినీ ఆకట్టుకుంటుందని ఊదరకొడుతున్నాడు. ఇకపోతే ఆయన చక్రి డైరెక్షన్‌లో చేసిన 'హోమం'కి సీక్వెల్ చేయబోతున్నారు. అక్టోబర్ 9న ఇది మొదలవుతుంది. అలాగే 'హోమం'ని హిందీ భాషలో కి ఆయనే రీమేక్ చేయాలని అనుకుం టున్నారని చెప్తున్నారు.
కుటుంబ చిత్రాల కథానాయకుడిగా పేరుపొందిన జగపతిబాబు తాజాగా 'హోమం' అనే యాక్షన్ ప్రధానమైన మాస్ సినిమా చేశారు. నటుడు జె.డి. చక్రవర్తి తె లుగులో తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్‌కుమార్ కోనేరు నిర్మించారు. శ్రీ వెంకటేశ్వరా ఫిలిమ్స్ అధినేత దిల్ రాజు పంపిణీ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











