‘రక్షకులు’ మూడో షెడ్యూల్ 24 నుండి చెన్నైలో
ఎస్.ఎల్.కె బ్యానర్ లో దర్శకుడు రవివర్మ, నిర్మాతలు వెంకటరమణాకెడ్డి, వేణు నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'రక్షకులు" ఈశ్వర్, ప్రేరణ, ఉదయ్, నీహారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు రవివర్మ.ఎమ్ మాట్లాడుతూ 'ఐ.ఎస్.ఐ.ఏజెంట్లను గుర్తించే పనిలో ఉన్న నలుగురు యువతీ యవకుల చుట్టూ తిరిగే కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇప్పటి వరకూ రెండు షెడ్యూళ్లు పూర్తిచేసుకొంది. ఈ నెల 24 నుండి చెన్నైలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామన్నారు. ఆడియోను వచ్చే నెల 20న రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా ఈ సినిమాలో సత్యప్రకాష్, దండపాణి, రామిరెడ్డి, కొండ వలస తదితరులు నటిస్తున్నారు.
rakshakulu eeshwar prerna uday niharika ravi varma venkataramana reddy venu రక్షకులు రవివర్మ వెంకటరమణాకెడ్డి వేణు ఈశ్వర్ ప్రేరణ ఉదయ్ నీహారిక సత్యప్రకాష్ దండపాణి


Click it and Unblock the Notifications