సూర్య, ప్రభాస్ రాక్షసుడు ఆడియో (ఫోటోస్)
హైదరాబాద్: సూర్య హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘మాస్' చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో మేధ క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. కృష్నారెడ్డి, రవీందర్ రెడ్డి నిర్మాతలు.
ఈ చిత్రంలో సూర్య సరసన నయనతార, ప్రనీత, నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ ఆడియో వేడుక సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిస్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇంకా కోదండరామిరెడ్డి, బన్నీ వాసు, మాజీ డిజిపి దినేష్ రెడ్డి, మల్టీ డైమన్షన్ వాసు, జ్ఞానవేల్ రాజా, డైరెక్టర్ వెంకట్ ప్రభు, ప్రేమ్ జీ, శ్రీమాన్, శశాంక్ వెన్నెల కంటి, ఎడిటర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

ఆడియో ఆవిష్కరణ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను ఆవిస్కరించారు.

సూర్య
సూర్య మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న కృష్ణా రెడ్డి, రవీందర్ రెడ్డిలకు థాంక్స్ చెప్పారు. కోదండరామిరెడ్డి టైటిల్ వాడుకున్నందుకు హ్యాపీగా ఉందన్నారు.

ప్రభాస్
ప్రభాస్ మాట్లాడుతూ....‘రాక్షసుడు' టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

వెంకట్ ప్రభు
దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ...ఈనెల 29న మీ ముందుకు వస్తున్నాం, మమ్మల్నిఆశీర్వదించాలని అని కోరారు.


Click it and Unblock the Notifications











