Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బెల్లంకొండ శ్రీనివాస్ బంపర్ ఆఫర్.. హిందీలోనూ కుమ్మేస్తున్న యువ హీరో!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ స్టూడియోస్, ఎ హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందిన చిత్రం రాక్షసుడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగాఆగస్ట్ 2న విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
శ్రీనివాస్ సినిమాలు య్యూటూబ్‌లో
యూట్యూబ్‌లో హిందీలో సౌత్‌లోనే నెంబర్ వన్ హీరోలాంటి సినిమాలు ఉన్నాయంటే బెల్లంకొండ శ్రీనివాస్‌దే. స్పీడున్నోడు 200 మిలియన్స్ దాటింది. జయ జానకి నాయక 140 మిలియన్స్ దాటి రన్ అవుతోంది. కవచం సినిమా 120 మిలియన్స్ దాటింది. అల్లుడు శీను లేట్‌గా టెలికాస్ట్ అయినా 100 మిలియన్ దగ్గర వ్యూస్ చేరుకుంది. సౌత్‌లో 400 మిలియన్, రెండు టు హండ్రెడ్ మిలియన్ దాటిన సినిమాలు చేసిన హీరో శ్రీనివాసే. హిందీలో, శాటిలైట్ పరంగా మా సినిమాలు అత్యద్భుతమైన ఆదరణను పొందుతుంది.
బెల్లంకొండ శ్రీనివాస్‌కు బాలీవుడ్ ఆఫర్
బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేస్తామని, మమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వస్తామని చెబుతూ మెయిల్ పంపారు. అంత గొప్ప సంస్థ నుండి అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాం. అలాగే దిల్‌రాజు బ్యానర్లో ఓ సినిమాను శ్రీనివాస్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది నేను కూడా మా అబ్బాయితో ఓ సినిమా చేయబోతున్నాను అని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు.
బాలీవుడ్లో నేనే సినిమా చేస్తా!
ఒకవేళ బాలీవుడ్ నిర్మాతలతో సినిమా వర్కవుట్ కాకపోతే, తెలుగులో విజయవంతమైన ఓ చిత్రాన్ని బాలీవుడ్లో నేనే నిర్మాతగా మారి రీమేక్ చేయాలనుకుంటున్నాను. `రాక్షసుడు` వంటి పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐదేళ్లుగా ఇలాంటి మంచి సక్సెస్ కోసం వెయిట్ చేశాను. సినిమా చేసిన నిర్మాతలకు, బయ్యర్స్‌కి మా `రాక్షసుడు` సినిమా లాభాలను తెచ్చిపెట్టింది అని అన్నారు.
తమిళ రీమేక్‌తో హిట్టు కొట్టి..
తమిళంలో రామ్ కుమార్ దర్శకత్వంలో విష్ణు విశాల్ నటించిన రాక్షసన్ సినిమా ఆధారంగా రాక్షసుడు సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రం తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఈ క్రమంలోనే నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.