బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' ప్రీ రివ్యూ.. ఒరిజినల్‌ని దించేశారు

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'రాక్షసుడు'. తమిళంలో కొంతకాలం క్రితం హిట్ కొట్టిన 'రాచ్చసన్' కి ఇది రీమేక్. హారర్ థ్రిల్లర్ మూవీగా ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స దర్శకత్వం వహించగా.. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించగా.. రాజీవ్ కనకాల, రాధా రవి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ రోజే (ఆగస్టు 2) న ఈ సినిమా విడుదలైంది. కాగా ఈ సినిమా ప్రీ రివ్యూ చూస్తే..

ఒరిజినల్ వర్షన్ లాగే

ఒరిజినల్ వర్షన్ లాగే


'రాచ్చసన్' అనే సినిమా 2018 సంవత్సరంలో వచ్చిన తమిళ సినిమాల్లోని హిట్ సినిమాల్లో ఒకటి. అయితే ఈ సినిమా రీమేక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రాక్షసుడు' సినిమాలో ఒరిజినల్ మూవీ థ్రిల్లింగ్ ఏ మాత్రం చెదరకుండా తెరకెక్కించారు. ఒకరకంగా చెప్పాలంటే అచ్చం ఒరిజినల్‌ని దించేశారని చెప్పుకోవచ్చు.

ఫస్టాఫ్.. సెకండాఫ్ రిపోర్ట్

ఫస్టాఫ్.. సెకండాఫ్ రిపోర్ట్

రాక్షసుడు రెండు భాగాలు బాగానే ఉన్నాయి. అయితే సెకండాఫ్ తో పోల్చితే ఫస్టాఫ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే బజ్ వినపడుతున్నది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోనేలా ఉన్నాయని తెలుస్తున్నది. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయంటున్నారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పర్‌ఫార్‌మెన్స్

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పర్‌ఫార్‌మెన్స్


ఒరిజినల్ వర్షన్ లో విష్ణు విశాల్ పోషించిన లీడ్ రోల్.. ఈ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పోషించాడు. ఆ క్యారెక్టర్ లీనమై నటించాడు. రాక్షసుడులో ఆయన నటన బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ నటన బాగుంది. అలాగే చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది అనే టాక్ వినిపిస్తున్నది.

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

'రాక్షసుడు' ట్రైలర్ రిలీజైన తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 14 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి ఇది భారీ మొత్తమే అని చెప్పొచ్చు. సినిమా హిట్ టాక్ రావాలంటే రూ.30 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X