Rashmika Mandanna రష్మికతో నా బంధం అలానే కొనసాగుతోంది... పెళ్లిపై మాజీ ప్రియుడు కామెంట్స్!
టాలీవుడ్లో చాలా కాలంగా ఎంతో మంది కన్నడ భామలు హీరోయిన్గా రాణిస్తున్నారు. వారిలో చాల మంది స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌కు కూడా వెళ్లి చక్రం తిప్పారు. అలాంటి వారిలో ప్రస్తుతం ముందుంటుంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా కెరీర్‌లో పుల్ జోష్‌తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈమెపై తన మాజీ ప్రియుడు, స్టార్ హీరో రక్షిత్ వైరల్ కామెంట్స్ చేశారు. ప్రస్తతం అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం అన్నారో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. నాగాశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. అక్కడ నుంచి ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వెలువెత్తాయి. గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి చిత్రాలతో వరుస హిట్ల్ను ఖాతాలో వేసుకుంది.

అలా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ అల్లు అర్జున్ పుష్పతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం. బాలీవుడ్‌లోనూ భారీ హిట్ బాలీవుడ్‌లోనూ రెండు మూడు సినిమాలు చేసింది రష్మిక. మొదట మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చేసింది. ఇవి అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ చేసి భారీ హిట్‌ను అందుకుంది.
రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమెకు హిందీలో మరిన్నిఅవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉంటోంది. దీంతో పాటే రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్‌తో పాటు మరిన్ని సినిమాలు చేస్తోంది. రౌడీ హీరోతో రిలేషన్షిప్ అయితే రష్మిక కన్నడలో సినిమాలు చేసే సమయంలో హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి వరకు వెళ్లింది. కానీ అనుకోని విధంగా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో తన డ్రీమ్‌ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె గతంలో వెల్లడించింది. ఆ తర్వాత ఆమె అనుకున్నట్టుగానే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు రక్షిత్ శెట్టి కూడా సినిమాలు చేస్తూ కెరీర్‌లో ముందుకెళ్తున్నారు.
అయితే తాజాగా రష్మికతో పెళ్లి క్యాన్సిల్ అవ్వడంపై మరోసారి స్పందించారాయన. మా పెళ్లి ఆగిపోయింది. అయినా ఏమైంది.? మేము ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం. ఆమెకు లైఫ్‌లో పెద్ద డ్రీమ్ ఉంది. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించింది. ఆ విషయంలో నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఏంటి ఇంకా వీరిద్దరు టచ్‌లోనే ఉన్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











