రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు తెలుగులో... రిలీజ్ ఆరోజే!
ఇటీవల కాలంలో కన్నడ సినిమాలు తెలుగులో బాగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాలు అయినప్పటికీ... తెలుగులోనూ రిలీజ్ చేసి హిట్ కొడుతున్నారు. ఇటీవల బాయ్స్ హాస్టల్ సినిమా కన్నడలో పెద్ద హిట్ అయి... తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ఇక్కడ కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు రష్మిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నటించిన ఓ సినిమా తెలుగులోకి రిలీజ్ కాబోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కన్నడ చిత్రాలకు ఇటీవల కాలంలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కన్నడ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అలా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన బాయ్స్ హస్టల్ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తే.. సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక మరో సినిమా తెలుగులోకి రాబోతుంది.

రష్మిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఒకప్పుడు రష్మికను ప్రేమించి... పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. నిశ్చితార్థం కూడా ఘనంగా జరుపుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు వీరు విడిపోయారు. ఇక ఈ హీరో చార్లీ 777 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది.
ఇప్పుడు మరో కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ సప్త సాగర దాచే ఎల్లో సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీకి తెలుగులో సప్త సాగరాలు దాటి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 22వ తేదీన తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది.

సప్త సాగర దాచే ఎల్లో మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులోకి విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 1న కన్నడంలో రిలీజైన సప్త సాగర దాచే ఎల్లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో... ఇప్పుడు తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు.
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించాగ... ఈ సినిమాకు హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించాడు. ఇక సప్త సాగర దాచే ఎల్లో సినిమాలో కథతో పాటు పాటలు బాగున్నాయంటూ ఆడియెన్స్ ప్రశంసలు కురిపించారు.ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ పేరుతో పార్ట్ వన్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక సప్త సాగర దాచే ఎల్లో సైడ్ బీ టైటిల్‌తో సీక్వెల్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











