ఈ వేసవిలోనే రక్షిత పెళ్ళి
కన్నడ దర్శకుడు ప్రేంను రక్షిత పెళ్ళిచేసుకోనుంది. తెలుగు, తమిళ సినిమాల్లో మొదట రక్షిత నటించిన సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి. ఆ తర్వాత ఆమె కెరీర్ బలహీనపడింది. దానితో ఆమె సెకండ్ హీరోయిన్‌గా, ఐటం సాంగ్ స్టార్‌గా నటిస్తోంది. ఇక దర్శకుడు ప్రేమ్ కన్నడ జోగి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. రక్షిత, ప్రేంల ప్రేమ వ్యవహారం చాలాకాలం పాటు రహస్యంగా సాగింది. ఇటీవలే ఉభయుల తలిదండ్రులు వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వేసవిలోపు వీరి వివాహం జరిగే అవకాశముంది. ప్రేం జోగి తెలుగు వెర్షన్‌లో ప్రభాస్ హీరోగా నటించనున్నారు.


Click it and Unblock the Notifications