Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మైనింగ్ డాన్ ‘గాలి’ కోసం హీరోయిన్ తాపత్రయం
మైనింగ్ మాఫియా డాన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. ఇత గాడి కోసం ఓ హీరోయిన్ తెగ తాపత్రయ పడుతోంది. అతన్ని కలిసి దీవెనలు తీసుకోవాలని గత కొంతకాలంగా ఆశగా ఎదురు చూస్తోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ రక్షిత. ఎట్టకేలు ఆమె కోరి తీరింది. బుధవారం కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డి ఉన్న జైలుకెళ్లి ఆయన్ను కలిసి దీవెనలు తీసుకుంది.
గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు స్థాపించిన బిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రక్షిత మార్చి 8న చేరిన విషయం తెలిసిందే. గాలికి వీర అభిమాని అయిన రక్షిత ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తోంది. అతన్ని అన్యాయంగా జైల్లో పెట్టారని, అతడు చాలా మంది మనిషి అని, ఎలాంటి తప్పులు చేయలేదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, గాలి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అంటోంది.
రక్షిత గతంలో తెలుగులో రవితేజతో 'ఇడియట్', జూ ఎన్టీఆర్‌తో 'ఆంధ్రావాలా', నాగార్జునతో 'శివమణి' తదితర చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా మంచి ఊపుమీద ఉన్నప్పుడే సినిమాల నుంచి తప్పుకుని పెళ్లి చేసుకున్న ఈ భామ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.