Rakshith Shetty ప్రతీ సినిమా ఆయనకే అంకితం అంటూ రక్షిత్ శెట్టి ఎమోషనల్
కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో డబ్బింగ్ చిత్రం సప్త సాగరాలు దాటి. ఈ సినిమా రేపు అనగా సెప్టెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుండగా.. సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రక్షిత్ శెట్టి.. తెలుగు ఫిల్మీ బీట్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి పునిత్ రాజ్ కుమార్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన కన్నడ స్టార్ గానే కాదు.. తెలుగులో కూడా అనేక సినిమాలు డబ్ చేసి ఇక్కడి ప్రేక్షకులు అందించాడు. ఇక ఆయన జిమ్ లో ఎక్సైజ్ చేస్తూ.. హాట్ స్ట్రోక్ వచ్చి ఆకస్మాత్తుగా మరణించాడు. ఆయన మరణం కన్నడ పరిశ్రమకు తీరని లోటనే చెప్పవచ్చు. తాజాగా ఆయన గురించి రక్షిత్ శెట్టి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

సప్త సాగారాలు దాటి సినిమా రిలీజ్ నేపథ్యంలో హైదరాబాద్ లో రక్షిత్ శెట్టి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే తెలుగు ఫిల్మీబీట్ కు ఇంటర్వూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పునీత్ రాజు కుమార్ గురించి రక్షిత్ వెల్లడిస్తూ... ఎమోషనల్ అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం తీరని లోటని వెల్లడించారు.

పునీత్ రాజ్ కుమార్ ను మేం చాలా మిస్ అవుతున్నాం. ఆయన మంచి వ్యక్తి. ఆయన్ని మేం కోల్పోవడం తీరని లోటు. ఆయనకు కన్నడ నుంచి వచ్చే ప్రతి సినిమా, ప్రతి టీజర్, ప్రతి పాట.. ఆయనకు ట్రిబ్యూటే. ఆయన లోటును ఎవరూ తీర్చలేరు. ఇండస్ట్రీలో ఓ మంచి నటుడిని, మంచి వ్యక్తిని కోల్పోయాం... అంటూ ఎమెషనల్ గా చెప్పుకు వచ్చారు రక్షిత్ శెట్టి.
ఇక సప్తసాగారాలు దాటి సినిమా విషయానికి వస్తే.. ఇదో ప్రేమ కథా చిత్రం. ఈ సినిమా కన్నడలో సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ అనే పేరుతో సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అయి... ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల గుండెల్ని పిండేసేందుకు సిద్ధం అయింది. ఈ చిత్రం రేపు అనగా సెప్టెంబర్ 22న తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.

ఇప్పటికే సప్తసాగరాలు దాటి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రక్షిత్ శెట్టి హీరోగా నటించిగా.. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించారు. ఇక ఈ సినిమాకు హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తోందో రేపు తేలనుంది.


Click it and Unblock the Notifications











