మరో సంచలనాని సిద్దమౌతోన్న రామ్ గోపాల్ వర్మ....
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన రక్త చరిత్ర చిత్రం గత నెలలో విడుదలయ్యి సంచలన విజయాన్ని సాదించింది. పార్టు- 1 చూసిన తర్వాత ప్రేక్షకుల్లో, రామ్ గోపాల్ వర్మ అభిమానుల్లో రక్త చరిత్ర పార్ట్2 పై అంచనాలు తారకస్థాయికి చేరాయి. ఈ చిత్రాన్ని మొదట్లో ఇదే నెలలో విడుదల చేయాలనుకున్నా అభిమానుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తగా తీర్చిదిద్దేందుకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శ్రద్దగా చూసుకోవటం వలన ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ....రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ కొత్తకోణాన్ని పార్ట్ 2లో చూస్తారు. డిసెంబర్ 3 న గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ చిత్రం సంచలన విజయాన్ని సాదిస్తుంది. మొదటి పార్ట్ లో వివేక్ ఒబేరాయ్ అద్భుతంగా నటించి మెప్పించాడు. సెకండ్ పార్ట్ లో సూర్య అత్యద్భుతంగా నటించి మెప్పిస్తాడు. ప్రియమణి కూడా సూపర్ గా చేసింది. ఈ చిత్రంలో హీరోలు, విలన్స్ వుండరు కేవలం పాత్రలు వాటి పరిస్థితులు మాత్రమే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సెకండ్ పార్ట్ లో చాల వున్నాయి. రాము గారు ఈ చిత్ర కధంశాన్ని తెరకెక్కించిన విధానం వండర్'. అని తెలిపారు.


Click it and Unblock the Notifications











