twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాంబు ప్రేలిన రోజే 'రక్త చరిత్ర-2' రిలీజ్ రోజు

    By Srikanya
    |

    రామానాయుడు స్టూడియో వద్ద బాంబు ప్రేలిన రోజే ..రక్త చరిత్ర-2 రిలీజు కాబోతోంది. 1997 నంవబర్ 19 న ఆ దుర్ఘటన చోటు చేసుకుంది. అదే రోజున ఆ సీన్ ఉన్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పార్ట్ 2 విడుదల కాబోతోంది. సూర్య ప్రధాన పాత్రలో సెకెండ్ పార్ట్ రన్ కానుందని సమాచారం. ఇక రామానాయుడు స్టూడియో వద్ద బాంబు ప్రేలుడుని అప్పుడు పరిటాల రవి ని టార్గెట్ చేసిందే అని తెలిసిందే. అలాగే ఆ ప్రేలుళ్ళులో మోహన్ బాబు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు పరిటాల రవి నిర్మాతగా ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరాములయ్య చిత్రం షూటింగ్ ప్రారంభం రోజు అది. ఇక ఈ విషయాన్ని పరిటాల రవి ప్రధానపాత్రలో వచ్చిన రక్త చరిత్ర 1 లో చిత్రీకరించలేదు. సెకెండ్ పార్ట్ లో ఈ సీన్ హైలెట్ గా, కీలకమై ఉండబోతోందని తెలుస్తోంది. దాంతో సినిమా వర్గాల్లోనే కాక రాజకీయవర్గాల్లోనూ రక్త చరిత్ర 2 పై ఆసక్తి పెరిగింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X