రక్త చరిత్ర సినిమా ఓ క్లాసికల్ మూవీ...!
రాయలసీమలో గోడవలకు పెట్టింది పేరు. అలాంటి రాయలసీమ ప్యాక్షన్ నేపద్యంలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న చిత్రం రక్త చరిత్ర. ఫ్యాక్షనిజానికి, వర్గపోరాటాలకు నిలయమైన రాయలసీమ యధార్ద సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపోందుతుంది. వివేక్ ఓబెరాయ్, సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సినర్జీ పతాకంపై మధు మంతెన, శీతల్ వినోద తల్వార్ కలసి నిర్మిస్తున్నారు. నిర్నాణం తుది దశకు చేరుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ కక్షలు కార్పణ్యాల వల్ల మోడులుగా మిగిలిన ఎన్నో కుటుంబాల కధ ఇది.
ఫ్యాక్షనిజానికి కయర్షియల్ పంధా జోడించి, డబ్బు సంపాదించడానికి మేము ఈ సినిమా తీయడం లేదు. ఈ సినిమా ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వనున్నాం. సూర్య, వివేక్ ఓబెరాయ్ కష్టపడి ఈ పాత్రలు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమా ఓ క్లాసికల్ మూవి లాగా తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి కూడా ఈ సినిమాలో మంచి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ సినిమా పాటలను మధుర ఆడియో ద్వారా ఈ నెల 26న విడుదల చేయనున్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











