Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్‌పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లాభాలను కొల్లగొట్టడంలో కొత్త చరిత్రను చూపించిన రామ్ గోపాల్ వర్మ...
ఒకే సినిమా కోసం ఒక్కొక్కరూ రెండు టికెట్లు కొనే విధంగా రక్తచరిత్ర"ని రెండు పార్టులుగా విడగొట్టి తన తెలివితేటలు చూపెట్టిన రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంపై దాదాపు యాభై కోట్ల రూపాయల లాభాన్ని పొందారనేది ఇండస్ట్రీ టాక్. ఆఫ్ కోర్స్ ..మీకిది వినడానికి వింతగానే వుండొచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం. కేవలం 22కోట్ల రూపాయల లాభాన్నిపొందారనేది ఇండస్ట్రీ టాక్. అప్ కోర్స్..మీకిది వినడానికి వింతగానే వుండొచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం. కేవలం 22కోట్ల రూపాయలో వ్యయంతో 'రక్త చరిత్ర"ని టోటల్ గా చుట్టిపారేసిన వర్మ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీల్లో రెండు పార్టులుగా, తమిళ్ లో సింగిల్ పార్ట్ గా మలిచి..
ఒకే కథని మొత్తం ఐదు సినిమాలుగా మార్చి..ఆ ఐదు సినిమాల శాటిలైట్ రైట్స్ రూపంలోనే తన ప్రొడక్షన్ కాస్ట్ ని కవర్ చేసేసుకున్నారు. ఇక ఈ ఐదు చిత్రాలకీ వసూళ్ళ రూపంలో వచ్చే రాబడి అంతా రామూకి లాభమేనట. అన్నట్టు రామూ లాభాల పంట 'రక్తచరిత్ర"కి మాత్రమే పరిమితం కాదండోయ్.. ప్రస్తుతం ఆయన సునీల్ హీరోగా రూపొందిస్తోన్న 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం 'అప్పలరాజు" చిత్రానికీ అది కంటిన్యూ కాబోతోంది. అయితే అచ్చంగా అది తెలుగు సినిమానే కదా. అందులో వర్మకి వచ్చేది ఎంతుంటుందిలే అనుకుంటారేమో..దాదాపు పాతిక కోట్ల రూపాయల వరకూ బిజినెస్ జరిగే ఆ చిత్రాన్ని కేవలం పది కోట్ల రూపాయల బడ్జెట్ లోనే ఫినిష్ చేసేస్తున్నారు రామూ. మరి ఓ కామెడీ హీరోపైనే పదిహేను కోట్ల రూపాయల ప్రాఫిట్ పొందడమంటే అదీ ఓ కొత్త చరిత్రేగా..అదీ వర్మ చాతుర్యమేగా...