అనంతపురం థియేటర్ లో రామ్ గోపాల్ వర్మ హల్ ఛల్

By Sindhu

పరిటాల రవి జీవితచరిత్ర ఆధారంగా.. సినిమా ప్రారంబంనుండి ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా వర్మ నిర్మించి చిత్రం 'రక్తచరిత్ర". ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. 'రక్తచరిత్ర"కు సెన్సార్‌ బోర్డు నుండి 'ఎ" సర్టిఫికెట్‌ లభించింది. చిత్రంలో అనంతపురం పేరును వినియోగించడంపై సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తపరిచారు. దీంతో దానిని ఆనందపురంగా మార్చారు. ఈ విడుదల విషయాన్ని వర్మ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేసారు.

అలాగే ఇంకో ఆసక్తికరవిషయం ఏమిటంటే విడుదల రోజున రక్తచరిత్ర రామ్ గోపాల్ వర్మ తో సహా యూనిట్‌ మొత్తం అనంతపురంలో ప్రేక్షకుల మధ్య కూర్చుని 'రక్తచరిత్ర"ను చూస్తారంట. మరి అనంతపురం ప్రజలతో పాటు ఈ సినిమాని చూస్తున్న రామ్ గోపాల్ వర్మ ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో వివేక్‌ ఒబేరాయ్‌ పరిటాల రవి పాత్రలో నటిస్తుండగా అతని భార్య సునీత పాత్రలో రాధిక ఆప్టే నటిస్తుంది. మద్దెలచెరువు సూరిగా సూర్య నటిస్తుండగా అతని భార్య భానుమతి పాత్రలో ప్రియమణి నటిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X