వర్మ 'రక్త చరిత్ర' బీహార్ లో జరిగిందా?
'రక్త చరిత్ర' కధ..రాయలసీమలో జరగపోవచ్చు. బీహార్ లో జరిగిందనుకోండి. ఇది కథ. ఎక్కడైనా జరగవచ్చు. రెండు వర్గాల మధ్య పోరాటం అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలా పరిటాల రవి కథగా చెప్పనప్పుడు...మరి ఎందుకు వారి కథను సినిమాకు తీసుకున్నారు అని అడిగితే.. సినిమాకు ఏదో ఒక కథ కావాలి కాబట్టి తీసుకున్నాం అన్నారు. ఇక హిందీ నటుడు వివేక్ ఒబరాయ్, తమిళ నటుడు సూర్యలను తెలుగు కథ రక్త చరిత్రలో ప్రధాన పాత్రలకు తీసుకోవటానకి కారణం చెబుతూ..తెలుగు వారైతే లీగల్ గా కొన్ని చిక్కులు వస్తాయి. అయినా ఇరు వర్గాల మధ్య పోరాటం అన్నప్పుడు ఆ ఎమోషన్స్ బాగా ఆ నటులు పండించగలరని తీసుకున్నాం అన్నారు. ఇక మొన్న ఆదివారం..రక్త చరిత్ర ఆడియో విడుదల అయ్యింది.
సూర్య వివేక్ ఒబరాయ్ రక్త చరిత్ర సి కళ్యాణ్ రామ్ గోపాల్ వర్మ raktha charitra surya vivek oberoi priyamani c kalyan ram gopal varma


Click it and Unblock the Notifications