Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'రక్త చరిత్ర' రిలీజ్ రోజు అనంతపురంలోనే..వర్మ
'రక్త చరిత్ర' చిత్రం అక్టోబర్ 21 వ తేదీన విడుదల కానుందని, ఆ రోజు తమ యూనిట్ అంతా అనంతపురం చేరుకుని అక్కడ ప్రేక్షకుల మధ్యన కూర్చుని సినిమా చూస్తామని చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఆయుధం పదును చూసిన ఇద్దరు మనుషుల కథే ఇది అంటున్నారాయన. అలాగే "రక్త చరిత్ర" హింసాత్మక చిత్రమే కానీ కేవలం భావోద్వేగాల్లోనే హింస ఉంటుంది. పాత్రల ఎక్సట్రీమ్ మరియు ఇండిడ్యువాలిటీ ఈ చిత్రంలో మీరు చూడచ్చు అని వర్మ స్పష్టం చేసారు. పరిటాల రవి,మద్దెల చెరువు సూర్య మధ్య జరిగిన సంఘర్షణ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక తెలుగు వెర్షన్ 21 న విడుదలైతే, హిందీ వెర్షన్ 22 విడుదల కానుంది. అలాగే మొదటి పార్ట్ రిలీజైన రెండు వారాల తర్వాత పార్ట్-2 రిలీజవుతుందని అన్నారు.
ఇక "రక్త చరిత్ర" చిత్రాన్ని హిందీ, తెలుగులో మాత్రమే రెండు భాగాలుగా తీశారు. తమిళం కోసం ప్రత్యేకంగా ఒక భాగమే తయారు చేసారు. హిందీ, తెలుగులో తీసిన మొదటి భాగంలో వివేక్ ఓబరాయ్ మాత్రమే కనిపిస్తారు. కేవలం క్లైమాక్స్ కు పది నిముషాల ముందు సూర్య ఎంట్రీ ఉంటుంది. రెండవ భాగం నుంచి సూర్య కథ గా నడుస్తుంది. ఇందులో పరిటాల రవిగా వివేక్ ఓబరాయ్, సూరిగా సూర్య చేశారు. సూరి భార్య భానుమతి కేరక్టర్ ప్రియమణి అయితే, రవి భార్య సునిత పాత్ర అనితా ఆప్టే పోషించారు.చిత్ర సమర్పకులు సి.కల్యాణ్ మాట్లాడుతూ 'ఫ్యాక్షనిజాన్ని తనదైన శైలిలో చూపించారు వర్మ. తెరపై రావణకాష్టంలాంటి నెత్తుటి నిజాలు సంచలనం కలిగించేలా ఉంటాయ''న్నారు. సంగీతం: ధర్మ సందీప్.