For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: రకుల్ ప్రీత్ కారులో ఆ పని చేసి, దారుణంగా.. పోర్న్‌స్టార్‌గా సీనియర్ హీరోయిన్!

  |

  సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కారణంగా వినయ విధేయ రామ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తొలగించారు. హీరో విశాల్ వివాహం చేసుకోబోయే హైదరాబాదీ అమ్మాయి అనిశాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి దుస్తులపై ఓ నెటిజన్ చేసిన దారుణమైన వ్యాఖ్యలు కలకలం సృష్టించే విధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలకు రకుల్ అంతే ఘాటుగా బదులిచ్చింది. ఇలాంటి హాట్ హాట్ వార్తలు ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి. వాటికి సంబందించిన పూర్తి వివరాలు మీ కోసం..

  ‘వినయ విధేయ'పై ట్రోలింగ్ ఎఫెక్ట్: ఆ సీన్లు కట్.. చిరంజీవి చూసి ఏమన్నారంటే.. ఇక ఆ భాషల్లోకి చెర్రీ

  ‘వినయ విధేయ'పై ట్రోలింగ్ ఎఫెక్ట్: ఆ సీన్లు కట్.. చిరంజీవి చూసి ఏమన్నారంటే.. ఇక ఆ భాషల్లోకి చెర్రీ

  రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కియారా అద్వానీ, ప్రశాంత్, స్నేహ తదితరులు నటించిన చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. అయితే ఈ చిత్రాన్ని మలయాళ, తమిళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   మహర్షికి పోకిరి ఎఫెక్ట్... మహేష్‌కు ఈసారి కూడా కలిసి వస్తుందా?

  మహర్షికి పోకిరి ఎఫెక్ట్... మహేష్‌కు ఈసారి కూడా కలిసి వస్తుందా?

  భరత్ అనే నేను లాంటి భారీ సక్సెస్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు మరో హిట్టుపై కన్నేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే చిత్రం మహర్షిలో ప్రిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్, అమెరికా, ఉత్తర భారతదేశంలో శరవేగం పూర్తి చేసుకొని బ్యాలెన్స్ సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన వార్త మీడియాలో ప్రచారమవుతున్నది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  డబ్బు పెట్టి కొన్నావా? విశాల్‌ నీకు సూట్ కాడు.. వదిలేయ్.. అనిషాకు చేదు అనుభవం

  డబ్బు పెట్టి కొన్నావా? విశాల్‌ నీకు సూట్ కాడు.. వదిలేయ్.. అనిషాకు చేదు అనుభవం

  హైదరాబాదీ అమ్మాయి అనిషా ఆళ్ల రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్టు హీరో విశాల్ ప్రకటించగానే సోషల్ మీడియా అలెర్ట్ అయింది. మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. కొందరు అభినందనలు తెలుపగా, మరికొందరు తమ నోటిదురుసును చేతివాటంతో ప్రదర్శించారు. విశాల్‌తో పెళ్లి గురించి తప్పుడు కూతలు కూసిన నెటిజన్లపై అనిషా ధీటుగా సమాధానం ఇచ్చింది. నెటిజన్లు ఏమన్నారు.. వారికి అనిషా ఏం సమాధానం ఇచ్చారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రకుల్‌ను మళ్లీ కెలికాడు.. ఈసారి మరింత దారుణంగా.. కారులో పడుకొన్న తర్వాత..

  రకుల్‌ను మళ్లీ కెలికాడు.. ఈసారి మరింత దారుణంగా.. కారులో పడుకొన్న తర్వాత..

  సినీ తార రకుల్ ప్రీత్ సింగ్‌కు మరోసారి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. అర్ధనగ్నంగా కారులో నుంచి దిగడంపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ రచ్చ రచ్చగా మారింది. నెటిజన్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన రకుల్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఓ వైపు రకుల్‌పై ట్రోల్ కొనసాగుతుండగా మరో నెటిజన్ దారుణమైన కామెంట్ చేశాడు. రకుల్, నెటిజన్ల మధ్య ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోననే మాట సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ.. స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. షాకివ్వబోతున్న శివగామి!

  పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ.. స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. షాకివ్వబోతున్న శివగామి!

  బాహుబలి చిత్రంలో శివగామిగా ప్రేక్షకుల చేత ప్రశంసలందుకొన్న రమ్యకృష్ణ ఎప్పడూ విభిన్నమైన పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇటీవల విడుదలైన శైలజారెడ్డి, హలో చిత్రాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న సూపర్ డీలక్స్ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించే పాత్ర ఆసక్తికరంగా ఉంటుందనే సినీ వర్గాల వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాని ఆ విషయం మాతో చెప్పాడు.. బిగ్‌బాస్‌పై బాంబు పేల్చిన బాబు గోగినేని!

  నాని ఆ విషయం మాతో చెప్పాడు.. బిగ్‌బాస్‌పై బాంబు పేల్చిన బాబు గోగినేని!

  ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ సెలెబ్రిటీలు కౌశల్, బాబు గోగినేని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాబు గోగినేని మాట్లాడుతూ కౌశల్ నిజాయతీగా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోలేదని చెప్పే ప్రయత్నం చేశారు. కౌశల్ ఆర్మీ అనేది చీకటి ఒప్పందం అని.. దానిని డబ్బులతో నడిపించి కౌశల్ విజేతగా నిలిచారని బాబు గోగినేని తీవ్రమైన ఆరోపణలు చేసారు. బాబు గోగినేని బిగ్ బాస్2 హోస్ట్ నానిని కూడా ఈ వివాదంలోకి లాగాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Rakul Preet brutally trolled for her short dress and gives fitting reply. Babu Gogineni made controversial comments on Bigg Boss show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X