ప్రభాస్‌కు నో చెప్పిన రకుల్.. కెరీర్‌లో బ్యూటీకి అదే పెద్ద తప్పా?
మోడలింగ్ రంగంలో బిజీగా ఉన్న సమయంలో రకుల్‌కు ఓ గొల్డెన్ చాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చిత్రంలో రకుల్‌ను తీసుకున్నారట.. కానీ తాను మోడలింగ్‌లో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఒకవేళ అదే సినిమాతో ఎంట్రీ ఇస్తే రకుల్ కెరీర్ మరోలా ఉండేదేమోనని టాక్ నడుస్తోంది. ఆ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీలో నటించిన కాజల్, తాప్సీలకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.

వరుస హిట్లు.. స్టార్ హీరోల పడిగాపులు..
అందం, అదృష్టం ఉండటంతో గోల్డెన్ లెగ్‌గా మారిన రకుల్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థతి అప్పట్లో ఉండేది. ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్‌తో సరైనోడు, రామ్ చరణ్‌తో ధృవ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లను కొట్టేసింది. ఇలా ఓ దశలో హవా కొనసాగించింది.

బోల్తా కొట్టిన పెద్ద సినిమా..
అయితే టాలీవుడ్‌లో ఇలా అప్రతిహతంగా దూసుకుపోతోన్న రకుల్‌కు స్పైడర్ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆ సినిమాతో కోలీవుడ్‌లోనూ పాగా వేద్దామనుకున్న ఈ బ్యూటీకి పెద్ద షాక్ తగిలింది. స్పైడర్ చిత్రం ఘోర పరాజయాన్నిచవిచూడటంతో రకుల్ కెరీర్ కూడా కుదేలైంది.

వెనుకబడిన రకుల్..
ఇక అక్కడి నుంచి రకుల్ గ్రాఫ్ పడిపోతూనే వస్తోంది. బాలీవుడ్ ప్రయత్నాలు కూడా అంతగా కలిసి రావడం లేదు. పైగా టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. రీసెంట్‌గా వచ్చిన మన్మథుడు 2 చిత్రంలో రకుల్ తేలిపోయింది. సినిమా కూడా డిజాస్టర్ కావడంతో రకుల్ వైపు చూసేవారే కరువయ్యారు.

గతంలో ప్రభాస్‌కు నో..
మోడలింగ్ రంగంలో బిజీగా ఉన్న సమయంలో రకుల్‌కు ఓ గొల్డెన్ చాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చిత్రంలో రకుల్‌ను తీసుకున్నారట.. కానీ తాను మోడలింగ్‌లో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఒకవేళ అదే సినిమాతో ఎంట్రీ ఇస్తే రకుల్ కెరీర్ మరోలా ఉండేదేమోనని టాక్ నడుస్తోంది. ఆ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీలో నటించిన కాజల్, తాప్సీలకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.

అదే అవకాశం ఇప్పుడు వస్తే..
ప్రభాస్‌కు రకుల్ నో చెప్పిందన్న వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ సినిమాలో చాన్స్ అంటే ఎగిరి గంతేస్తోందని, వెంటనే ఓకే చెబుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ తన 20వ చిత్రం జాన్‌పై దృష్టి పెట్టనున్నారు. ఇక రకుల్ విషయానికొస్తే బాలీవుడ్ చిత్రం మార్జావాన్‌పై ఆశలు పెట్టుకుంది.

Click it and Unblock the Notifications