పవన్ మూవీలో ఛాన్స్: రాకుల్ ప్రీత్ సింగ్ ఇలా అందేంటి?

By Bojja Kumar

హైదరాబాద్: గబ్బర్ సింగ్ 2 చిత్రంలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఎంపికయిందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వార్తా పత్రికల్లో కూడా ఈ విషయం ప్రముఖంగా రావడంతో అంతా నిజమే అనుకున్నారు. ఇదే విషయం ఆమెను అడిగితే షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఇలాంటి వార్తలు నేనూ విన్నాను...ఎవరు ఇలాంటి వార్తలు సృష్టిస్తారో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ నాకు అలాంటి ఛాన్స్ ఏమీ రాలేదు అంటూ సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి గబ్బర్ సింగ్ 2 చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదని స్పష్టమవుతోంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ -2' చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం స్క్రిప్టు పనులన్నీ పూర్తయ్యాయినట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

Rakul Preet Singh about ‘Gabbar Singh 2’

సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 'రచ్చ'తో ఆకట్టుకున్న సంపత్‌.. ఆ తరవాత చేస్తున్న చిత్రమిదే. శరత్‌ మరార్‌ నిర్మాత. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X