»   »  అమ్మానాన్నకు ఓకే..... మీకెందుకు అభ్యంతరం? మాగ్జిమ్ హాట్ ఫోజులపై రకుల్

అమ్మానాన్నకు ఓకే..... మీకెందుకు అభ్యంతరం? మాగ్జిమ్ హాట్ ఫోజులపై రకుల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్లో వరుస అవకాశాలతో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్ సినిమాలపై పెట్టింది. ఇందుకోసం ఏం చేయడానికైనా, అందాల ఆరబోత విషయంలో ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధం అని సంకేతాలు ఇస్తూ 'మాగ్జిమ్' మేజగైన్ కోసం ఇటీవల హాట్ హాట్ ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె హాట్ ఫోజులపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో రకుల్ ఘాటుగా స్పందించారు.

హాట్ హాట్‌గా రకుల్ రెచ్చిపోయిందిగా
మా అమ్మా నాన్నలకు ఓకే.. మీకెందుకు?

మా అమ్మా నాన్నలకు ఓకే.. మీకెందుకు?

మీ మాగ్జిమ్ ఫోటో షూట్ మీద కామెంట్లతో పాటు కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు, దీనిపై ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ..... ఈ ఫోటో షూట్ విషయంలో నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అందుకు సంతోషంగా ఉంది. ఇక విమర్శలు అంటే ఇవి ప్రతి చోటా ఉంటాయి. అయితే నేను ఇది కొత్తగా మొదలు పెట్టిన ట్రెండ్ కాదు. ప్రతి యాక్ట్రెస్, యాక్టర్ తమ కెరీర్లో ఒకసారైనా ఇలా మేగజైన్ కవర్ పేజీపై కనిపించనవారే. వారిలాగే నాకూ ఒక అకాశం వచ్చింది. కామెంట్స్ గురించి పట్టించుకోను. నాకు ఏది రైట్ అనిపిస్తే అది అది చేస్తాను, అందుకు మా అమ్మా నాన్నల నుండి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు.... అంటూ రకుల్ వ్యాఖ్యానించారు.

 నేనేమీ ఖాళీగా కూర్చోలేదు

నేనేమీ ఖాళీగా కూర్చోలేదు

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘ఐయ్యారి' చిత్రం తాజాగా బాలీవుడ్లో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 2014లో యారియాన్ సినిమాతో బాలీవుడ్లో మీ నటజీవితం ప్రారంభించిన మీరు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అనే ప్రశ్నకు ప్రశ్నకు రకుల్ స్పందిస్తూ.... నాకు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం ఉండదు. అందుకే తెలుగు, తమిళంలో అవకాశాలు కావడంతో దక్షిణాది వైపు వెళ్లాను. నాలుగేళ్ల కాలంలో 16 సినిమాలు చేశాను అని రకుల్ సమాధానం ఇచ్చారు.

 చాలా విషయాల్లో సిద్దు నాకు కనెక్ట్ అయ్యాడు

చాలా విషయాల్లో సిద్దు నాకు కనెక్ట్ అయ్యాడు

ఐయ్యారి చిత్రంలో నాతో పాటు కలిసి నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా చాలా విషయాల్లో నాకు కనెక్ట్ అయ్యాడు. మేము ఇద్దరం ఢిల్లీకి చెందిన వారమే. ఇద్దరం మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత మేము ఇద్దరం నైబర్స్ అని అర్థమైంది. మేము ఇద్దరం కూడా డిఫెన్స్ కాలనీకి చెందిన వారమే. ఇద్దరం ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాం, ఇద్దరికీ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేదు అని రకుల్ తెలిపారు.

 ధోనీ చిత్రంలో నటించే అవాకాశం మిస్సయింది

ధోనీ చిత్రంలో నటించే అవాకాశం మిస్సయింది

నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన ‘ఎంఎస్ ధోనీ' చిత్రంలో నాకు అవకాశం వచ్చింది. ఆ ప్రాజెక్టుకు సైన్ చేశాను. అంతా పూర్తయ్యాక వారు డేట్స్ మార్చారు. నేను అప్పటికే మరో మూడు సినిమాలు చేస్తుండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయాను. ఆ సినిమా మిస్సయినా ఇపుడు మళ్లీ నీరజ్ పాండే దర్శకత్వంలో ‘ఐయ్యారి'లో దక్కింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటుంది అని తెలిపారు.

 కాస్టింగ్ కౌచ్ గురించి

కాస్టింగ్ కౌచ్ గురించి

తనకు కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు ఇప్పటి వరకు ఎదురు కాలేదని, తనతో ఎవరూ అలా బిహేవ్ చేయలేదని రకుల్ ప్రీత్ సింగ్ ఈసందర్భంగా వెల్లడించారు.

 అందుకే తెలుగులో చేయడం లేదు

అందుకే తెలుగులో చేయడం లేదు

ప్రస్తుతం తెలుగులో ఏ ప్రాజెక్టు చేయక పోవడానికి కారణం తనకు సరైన కథ దొరకక పోవడమే అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా తనకు కథే ముఖ్యమని, కథ నచ్చితేనే సిమా చేస్తాను అన్నారు.

విమర్శలు ఇలా

విమర్శలు ఇలా

రకుల్ ప్రీత్ సింగ్ మాగ్జిమ్ మేగజైన్ హాట్ ఫోటోలు చూసిన తర్వాత పలువు అభిమానులు ఈ విధంగా స్పందించారు.

English summary
"I think each actor and actress has been on the cover of the magazine at least once, for sure. I also got an opportunity and I did that, and that's about it. I don't even read the comments. I do what I feel like doing, what I feel is right and what my family is okay with." Rakul Preet Singh said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X