International Yoga Day : రకుల్ ప్రీత్ కు కేంద్ర పురస్కారం.. ఎందుకంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ విషయంలో ఎంతంటి స్ఫూర్తినిస్తుందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్లు తరుచుగా తమ వెకేషన్లకు, టూర్లకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ఉంటే.. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరుచూ తన ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ ద్వారా అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ వచ్చింది. ఫిట్ నెస్, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కలిగిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రకుల్ ప్రీత్ ను ఆమె భర్త జాకీ భగ్నానిని ఘనంగా సత్కరించి అవార్డ్ ను అందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో యోగాథాన్..
జూన్ 21న ఇండియా వ్యాప్తంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యేటా నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్యం, ఫిటనెస్ పైనా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన ఉండేలా ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. ఇక తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో యోగాథాన్ ను భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. ఫిట్ ఇండియా మూమెంట్ లో భాగంగా వరల్డ్ యోగా డేను గ్రాండ్ గా జరిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులు, సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్లు, యోగా నిపుణులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్, తన భర్త, బాలీవుడ్ స్టార్ జాకీ భగ్నానీతో కలిసి పాల్గొంది.

Rakul Preet Singh and her Husband Recognised as Fit Indian Couple

ఫిట్ ఇండియా కపుల్ అవార్డ్..
రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫిట్ నెస్ విషయాలను పంచుకోవడమే కాకుండా.. నెటిజన్లకు కూడా టిప్స్ ఇస్తూ ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం తాజాగా రకుల్ ప్రీత్ ను సత్కరించింది. తనతో పాటు ఆమె భర్త జాకీ భగ్నానీకి కూడా ఈ గౌరవం దక్కింది. ఫిట్ ఇండియా కపుల్.. టైటిల్ ను కేంద్ర ప్రభుత్వం యూనియన్ స్టోర్స్ మినిస్టర్ డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అందజేసి సత్కరించారు.

ఈ గౌరవం పొందినందుకు చాలా సంతోషంగా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తమ ఫిట్‌నెస్ పైనా ఫోకస్ పెట్టాలని సూచించింది. తనతో పాటు కేంద్ర ప్రభుత్వం తన భర్తను కలిసి ఫిట్ ఇండియా కపుల్ అవార్డ్ ను అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ప్రతి రోజూ ఉదయం 2 గంటల పాటు వర్కౌంట్స్, యోగా, జిమ్ చేస్తుంటుంది. ఫిట్ నెస్ అంటేనే హీరోయిన్లలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ పేరే వినిపిస్తుంది.

రకుల్ ప్రీత్ నుంచి రాబోయే చిత్రాలు..
టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్ల పాటు ఊపూపింది. ఏకంగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, నాగచైతన్య, రామ్ పోతినేని వంటి స్టార్స్ తో నటించింది. తెలుగులో చివరిగా 'కొండపొలం'లో కనిపించింది. ఆ తర్వాత తమిళ చిత్రం ఇండియన్ 2తో అలరించింది. ఇక కొన్నాళ్లుగా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ వస్తోంది. నెక్ట్స్ ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X