»   » రకుల్ ప్రీత్ సింగ్‌‍ను ఎమ్మెల్యేగా చూడబోతున్నాం...!

రకుల్ ప్రీత్ సింగ్‌‍ను ఎమ్మెల్యేగా చూడబోతున్నాం...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రకుల్ ప్రీత్ సింగ్... టాలీవుడ్లో వేగంగా ఎదుగుతున్న హీరోయిన్. ఇప్పటికే పలువురు టాలీవుడ్ టాప్ హీరోలతో అవకాశాలు దక్కించుకున్న ఆమెను త్వరలో ఎమ్మెల్యేగా తెరపై చూడబోతున్నాం. ఆమె చేసిన గత సినిమాలకు భిన్నమైన డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌లో రకుల్ కనిపించబోతోంది.

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరక్కెతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా ‘సరైనోడు' అనే టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో బోయపాటి శ్రీను రకుల్ ప్రీత్ సింగ్ ను ఎమ్మెల్యే క్యారెక్టర్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది.

Rakul Preet Singh To Become An MLA Soon

ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ అంటే గ్లామర్ డాల్ గానే మనకు తెలుసు. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఎలా కనిపించబోతోంది. గ్లామరస్‌గా కనిపిస్తుందా? లేక ఎమ్మెల్యే పాత్రలో పవర్ ఫుల్‌గా కనిపించబోతోందా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

English summary
According to the grapevine, Rakul will be donning a different role in her next outing with Allu Arjun, which is titled Sarainodu. Th actress has reportedly turned in to an MLA for the film and director Boyapati Srinu has given a completely different characterization for our long legged lass.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu