‘కరెంటు తీగ’ హీరోయిన్ బికినీ వీడియో లీక్
హైదరాబాద్: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఢిల్లీ బ్యూటీ రాకుల్ ప్రీత్ సింగ్....ఆ చిత్రం విజయవంతం కావడంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. దీని తర్వాత విడుదలైన ‘లౌక్యం' భారీ విజయం సాధించడం బాగా కలిసొచ్చింది.
ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా, అటు గ్లామర్ పరంగా రాకుల్ ప్రీత్ సింగ్ ఫాంలో ఉండటం....ఆమె రెమ్యూనరేషన్ కూడా రీజనబుల్‌గా ఉండటంతో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విడుదలైన ‘కరెంటు తీగ' చిత్రంలో రాకుల్ తన నటన, అందంతో సినిమాకు ప్లస్సయింది.

ప్రస్తుతం రాకుల్ ప్రీత్ సింగ్ ఆది హీరోగా తెరకెక్కుతున్న రఫ్, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పండగ చేస్కో, శ్రీనివాసరెడ్డి సినిమాలో, కిక్ 2 చిత్రంలో రవితేజ సరసన నటిస్తోంది. దీంతో పాటు రమేష్ సిప్పీ చిత్రం సిమ్లా మిర్చిలోనూ నటిస్తోంది. కాగా తాజాగా ఇంటర్నెట్లో రాకుల్ ప్రీత్ సింగ్ బికినీ వీడియో హల్ చల్ చేస్తోంది. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడలింగ్ చేసింది, అందాల పోటీల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











