సమంతపై రకుల్ కామెంట్.. నాగార్జునతో అనుభవం అలాంటిది

సౌత్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత బాలీవుడ్‌లోను హంగామా చేస్తోంది. మితిమీరిన గ్లామర్ షో చేస్తూ బీ టౌన్ ప్రేక్షకులను కూడా బుట్టలో వేసుకుంటోంది రకుల్. ఇటీవలే దే దే ప్యార్ దే సినిమాలో సీనియర్ హీరో అజయ్ దేవగన్ సరసన రకుల్ చూపిన పర్‌ఫార్‌మెన్స్ ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతుండటంతో సరదాగా కాసేపు ట్విట్టర్ వేదికగా అభిమానులతో టచ్ లోకి వచ్చింది రకుల్. ఈ సందర్బంగా అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆ వివరాలు చూద్దాం..

 అలా అయితేనే సరైన దారిలో వెళ్తున్నట్లు

అలా అయితేనే సరైన దారిలో వెళ్తున్నట్లు

ఏ వ్యక్తికైనా కొన్ని విలువలు, ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు సాధనలో ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంది. అయితే ఈ జర్నీలో సక్సెస్ అయిన ప్రతీసారి మొదటగా గర్వించేది తల్లిదండ్రులే. అందుకే తల్లిదండ్రులు తనను చూసి గర్వించే ప్రతి క్షణం తనకు ఆనందాన్నిస్తుందని, అప్పుడే తాను సరైన దారిలో వెళ్తున్నట్లు అని ఓ నెటిజన్ ప్రశ్నకు బదులిచ్చింది రకుల్.

నాతో ఉండే మనుషులే ముఖ్యం

నాతో ఉండే మనుషులే ముఖ్యం

రకుల్.. మీకు ఏయే ప్రదేశాలంటే ఎక్కువగా ఇష్టం అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది రకుల్. స్నేహితులతో సరదాగా గడిపిన ఏ ప్రదేశమైనా తనకు ఇష్టమేనని, అదేవిధంగా మనం ఏ ప్రదేశానికి వెళ్తున్నాం అనే దానికన్నా మనతో వెంట వచ్చే మనుషులు ఎవరనేది ముఖ్యమని రకుల్ చెప్పుకొచ్చింది. ఇక విహారయాత్రకు మీరు ఎంచుకుంటే లండన్ ప్రిఫర్ చేస్తానని రకుల్ అంటోంది.

సమంతపై కామెంట్..

సమంతపై కామెంట్..

నేటితరం హీరోయిన్ల మధ్య సంబంధాలు ఎలాంటివి? వారి వారి మనస్సులో తోటి హీరోయిన్ గురించి ఏమనుకుంటున్నారు? అనేది ప్రేక్షకులకు చాలా ఆసక్తికర అంశం. ఈ మేరకు రకుల్.. సమంతపై మీ అభిప్రాయమేంటని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. అయితే దీనికి సింపుల్ గా సమంత ఓ పవన్ ఫుల్ విమెన్ అని, ఆమె అంటే తనకు చాలా చాలా ఇష్టమని ఓకే మాటలో చెప్పేసింది రకుల్.

నాగార్జునతో రొమాన్స్ విషయమై..

నాగార్జునతో రొమాన్స్ విషయమై..

రకుల్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి మన్మథుడు 2 సెట్స్‌పై చురుకుగా కదులుతోంది రకుల్. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ చేరుకుంది. ఈ విషయమై రకుల్ స్పందిస్తూ.. మన్మథుడు 2 జర్నీ చాలా ఫన్‌గా, పాజిటివ్‌గా ఉందని పేర్కొంది. తనకు ఇష్టమైంది కేవలం నటనేనని రకుల్ చెప్పింది.

ప్రస్తుతం రకుల్..

ప్రస్తుతం రకుల్..

ఇటీవలే 'దే దే ప్యార్ దే' సినిమాలో రకుల్ రొమాన్స్ బాగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌లో సూర్య సరసన రకుల్ నటించిన ఎన్జీకే సినిమా మే 31న విడుదలకు సిద్ధమైంది. ఇక తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ చిత్రంలో నాగార్జున, సమంత, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X