Rakul Preet Singh: సౌత్ సినిమాలపై రకుల్ కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం.. అసలు ఏమన్నదంటే?
ఒక సమయంలో తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా యూత్‌ను అట్రాక్ట్ చేసింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఫిట్ నెస్ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా రకుల్ ప్రీత్ సింగ్ మారిన.. ఆ సినిమాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో 2022లో బిగ్గెస్ట్ డిజాస్టర్ హీరోయిన్ నిలిచింది.
వరుసగా ఫ్లాప్స్ వచ్చిన కూడా రకుల్ కు హిందీలో అవకాశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సౌత్ సినీ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో రకుల్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఎంతోమందికి..
ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ అనేక తెలుగు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే ఎంతోమందికి క్రష్ గా కూడా మారింది. అలాంటి ముద్దుగుమ్మ రకుల్ గిల్లి అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా కన్నడలో 7జీ బృందావన్ కాలనీ సినిమాకు రీమెక్ గా వచ్చింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్ అయిపోయాక పాకెట్ మనీ కోసం ఈ సినిమా చేసింది. గిల్లీ మూవీ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

కెరటంతో మొదలు పెట్టి..
రకుల్ ప్రీత్ సింగ్ మొదటి తెలుగు సినిమా అయిన కెరటం హిట్ కాలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీలో అవకాశం లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలో ప్రార్థనగా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునేలా అలరిచింది. అనంతరం రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా, స్పైడర్, ఖాకీ, ఎన్జీకే, చెక్, కొండపొలం వంటి తెలుగు సినిమాలు చేసింది.

తమిళంలోనూ..
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న క్రమంలోనే హిందీ చిత్రపరిశ్రమ వైపుకు వెళ్లింది క్యూట్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. యారియాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. అయ్యారే, దే దే ప్యార్ దే, రన్ వే 34, అటాక్ పార్ట్ 1, కట్ పుట్లీ, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, ఛత్రీవాలీ వంటి సినిమాలు చేసింది. తెలుగు, హిందీ మాత్రమే కాకుండా తమిళంలోనూ అనేక సినిమాలు చేసి అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

వాళ్లకు చురకలు..
అయితే క్యూట్ భామ రకుల్ ప్రీత్ సింగ్.. నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. జాకీ నిర్మాతగా వ్యవరించిన మాషుకీ అనే వీడియో సాంగ్ ను వివిధ భాషల్లో గతేడాది విడుదల చేశారు. ఇక వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు మాత్రమే కాకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై ఇటీవల స్పందించిన రకుల్ తన పెళ్లి గతేడాది నవంబర్ లోనే జరిగిపోయినట్లు చెప్పింది. ఇలాంటి పుకార్లు సృష్టించే వాళ్లకు చురకలు అంటించింది.

మరీ ఎక్కువ చేస్తున్నారు..
ఇదిలా ఉంటే ఇటీవల ఇండస్ట్రీలో సౌత్ వర్సెస్ నార్త్ అంటూ వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే.. సౌత్ సినిమాలు మాసివ్ హిట్స్ కొట్టాయి. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ఈ విషయంపైనా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ను అడగ్గా "దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే మరీ ఎక్కువ చేస్తున్నారు" అని కామెంట్స్ చేసింది రకుల్ ప్రీత్.

ఎమోషన్స్ పై ఆధారపడి..
ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కొనసాగిస్తూ హిందీ సినిమా, ప్రాంతీయ (సౌత్) సినిమాలు రెండు భారతీయ సినీ పరిశ్రమలే. అది గుర్తుంచుకోవాలి. ఒకదానితో ఒకటి పోల్చడం కరెక్ట్ కాదు. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. అన్ని సినీ పరిశ్రమల్లోనూ గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్లంతా మంచి సినిమాలు ఇచ్చేందుకే కష్టపడుతున్నారు. సినిమా బాగుంటే థియేటర్ అయినా ఓటీటీ అయినా హిట్ అవుతుంది. సినిమా ఫలితం ఆడియెన్స్ ఎమోషన్స్ పై ఆధారపడిం ఉంటాయి. అంతేకానీ సినీ పరిశ్రమకి సంబంధించి కాదు" అని చెప్పుకొచ్చింది.

కోపం వస్తోందా..
అయితే రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు ఆగ్రహంతో విమర్శలు గుప్పిస్తున్నారు. "బాలీవుడ్ పరజయాల్లో ఉందంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడేమో ఇలా అందరూ ఒకటే అని మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ అస్సలు పట్టించుకోలేదు", "బాలీవుడ్ సినిమాలను సౌత్ చిత్రాలతో పోలుస్తుంటే కోపం వస్తోందా.. గతంలో సౌత్ సినిమాలతోనే గుర్తింపు వచ్చిన విషయం మర్చిపోయావా" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











