కిక్-2లో రవితేజ సరసన హీరోయిన్ ఖరారైంది

By Bojja Kumar

హైదరాబాద్: ‘కిక్-2' చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ ఖరారైంది. వెంకటాద్రి‌ ఎక్స్‌ప్రెస్ ఫేం రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 20న ఈచిత్రం లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ...‘కిక్' తర్వాత మళ్లీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో ఫుల్ లెంగ్త్ ఎంటర్టెనర్ చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది మంచి కిక్ ఇచ్చే సినిమా అవుతుంది అన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ....‘ఈ సినిమా ‘కిక్'కి సీక్వెల్ కాదుగానీ అందరికీ డబుల్ కిక్ ఇచ్చే సినిమా అవుతుంది. ‘కిక్'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్-2' అన్నారు.

Rakul Preet Singh confirmed for Kick 2

నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... రవితేజ, సురేందర్ రెడ్డి హిట్ కాంబినేషన్. మార్చి 28, 2015 న సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని కళ్యాణ్ రామ్ తెలిపారు.

ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సంగీతం: యస్ యస్ థమన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్ : నారాయణరెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X