బ్రేకింగ్: రకుల్ ప్రీత్ సింగ్, దీపిక, సారా, శ్రద్దాలకు నోటీసులు.. 24న విచారణకు ఎన్సీబీ ఆదేశాలు
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో అందరూ ఊహించనట్టుగానే టాప్ హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. గత కొద్దికాలంగా బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో అగ్ర హీరోయిన్లు నలుగురికి నోటీసుల జారీ చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జయ సాహాను పలు రౌండ్లు ప్రశ్నించిన తర్వాత
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్ జయా సహాను అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. బుధవారం కూడా ఆమెను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. పలు రౌండ్లపాటు ప్రశ్నించిన తర్వాత సేకరించిన సమాచారం ఆధారంగా సంచలనం నిర్ణయం తీసుకొన్నారు.

రకుల్, శ్రద్దా, దీపిక, సారాకు నోటీసులు
టాలెంట్ మేనేజర్ జయ సాహా విచారణలో అన్ని విషయాలు స్పష్టంగా నిర్ధారించుకొన్న తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, సైమన్ కంబట్టాకు నోటీసులు జారీ చేశారు. వారితో పాటు దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్, రియా మేనేజర్ శృతి మోడీకి కూడా సమన్లు జారీ చేశారు.

సెప్టెంబర్ 24న విచారణ
డ్రగ్ కేసులో విచారణకు రావాలంటూ సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ నోటీసులు పంపారు. వారిని సెప్టెంబర్ 24 తేదీ గురువారం విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నట్టు సమాచారం. దీపిక పదుకోన్, కరిష్మాను సెప్టెంబర్ 25న విచారణకు రమ్మని పిలిచినట్టు తెలుస్తున్నది.

దీపిక గోవాలో.. రకుల్ ప్రీత్ సింగ్ వికారాబాద్‌లో
ప్రస్తుతం దీపిక పదుకోన్ గోవాలో తన సినిమా షూటింగులో ఉన్నారు. మీడియాకు దూరంగా ఉంటూ మొబైల్ ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్ చేసినట్టు తెలుస్తున్నది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.

శ్రద్దాకపూర్‌కు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశా
సుశాంత్, రియా టాలెంట్ మేనేజర్ జయ సాహాను ఎన్సీబీ అధికారులు విచారించిన సమయంలో పలు విషయాలను అంగీకరించినట్టు తెలిసింది శ్రద్దాకపూర్, రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆన్‌లైన్ ద్వారా కన్నాబిస్ ఆయిల్‌ను ఆర్డర్ చేసినట్టు ఒప్పుకోవడం బుధవారం రోజు విచారణలో హైలెట్‌గా మారింది.
Recommended Video

రకుల్, దీపిక , శ్రద్దా, సారా విచారణ తేదీలు ఇవే
రకుల్ ప్రీత్ సింగ్, సైమన్ కంబాట్టాను సెప్టెంబర్ 24న, దీపిక పదుకోన్‌ను సెప్టెంబర్ 25న, శ్రద్దా కపూర్, సారా ఆలీ ఖాన్‌ను సెప్టెంబర్ 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ సమన్లతో బాలీవుడ్ సినీ పరిశ్రమ మరోసారి ఉలిక్కిపాటుకు గురైంది.


Click it and Unblock the Notifications











