»   » నితిన్‌తో రొమాన్స్: రూ. కోటి డిమాండ్ చేస్తోంది

నితిన్‌తో రొమాన్స్: రూ. కోటి డిమాండ్ చేస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా బిజీ అయిపోయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వరుసగా టాప్ హీరోలందరి నుండి ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అమ్మడు రవితేజ సరసన ‘కిక్ 2', రామ్ సరసన ‘పండగ చేస్కో', రామ్ చరణ్ సరసన ‘మై నేమ్ ఈజ్ రాజు', ఎన్టీఆర్-సుకుమార్ ప్రాజెక్టుతో పాటు మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం'లో కూడా అవకాశం దక్కించుకుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నూతన దర్శకుడు వేణు దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అమ్మడు అక్షరాల రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. నితిన్ సినిమా కోసం ఆమెను సంప్రదించగా రూ. కోటి ఇస్తేనే చేస్తానని తెగేసి చెప్పింది. వెంటనే ఆమె అడిగిన మొత్తం ఇవ్వడానికి అంగీకరించి డేట్స్ బుక్ చేసుకున్నారట.

Rakul Preet Singh demanded 1 crore for Nitin movie

దీన్ని బట్టి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది. చూడ చక్కని రూపం, హాట్ అండ్ సెక్సీ గా ఒంపు సొంపులు, అందాల ఆరబోతలో తెగింపు, డాన్సర్ పరంగా, నటన పరంగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో రాకుల్ ప్రీత్ సింగ్ కు డిమాండ్ పెరిగిందని అంటున్నారు.

English summary
Film Nagar sources said that, Rakul Preet Singh has been approached for Nithiin’s upcoming project which will be directed by debutant Venu.Well the beauty is in demand and hence the demand. Guess the makers are not having any second thoughts to rope the girl.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu