మేగజైన్ ఫోటో షూట్: బికినీలో మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
తెలుగులో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.... ఇండస్ట్రీలో ఆమె ఇంత స్ట్రాంగ్‌గా పాతుకుపోవడానికి కారణం కేవలం నటన మాత్రమే కాదు, ఏ మాత్రం మొహమాట పడకుండా సెక్సీగా అందాలు ఆరబోసే తెగింపు కూడా ఉండటం. కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ కావాలని దర్శకులు కోరితే వెంటనే ఓకే చెప్పే విశాల హృదయం కూడా ఆమె సొంతం.

మాగ్జిమ్ కవర్ పేజీపై
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ‘మాగ్జిమ్' మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీపై బికినీలో అందాలు ఆరబోసింది. గతంలో రకుల్ బికినీల్లో కనిపించినప్పటికీ ఇంత హాటుగా ఎప్పుడూ కనిపించలేదని అంటున్నారు అభిమానులు.
Recommended Video


బాలీవుడ్ దృష్టి తనపై పడాలనే
రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్టుండి ఇలా మాగ్జిమ్ కవర్ పేజీపై సెక్సీగా అందాలు ఆరబోయడానికి కారణం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టి తనపై పడాలనే ఉద్దేశ్యమేనంట. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతో చేసిన ఆమె ఇపుడు బాలీవుడ్ అవకాశాల మీద కన్నేసింది.

రెండు హిందీ చిత్రాల్లో రకుల్
ప్రస్తుతం రకుల్ హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ‘అయ్యారి' అనే చిత్రం ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు అజయ్ దేవగన్ చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది.

స్పైడర్ ప్లాపు ఎఫెక్ట్
గతేడాది మహేష్ బాబుతో రకుల్ ప్రీత్ సింగ్ ‘స్పైడర్' చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం భారీ ప్లాపు కావడంతో రకుల్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సైన్ చేయలేదు.

హిందీ, తమిళ చిత్రాలు
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రెండు హిందీ చిత్రాలతో పాటు, తమిళంలో కార్తి సరసన ఓ సినిమాలో, సూర్య 36వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరి రకుల్ బికినీ అందాలపై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టి పడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











