»   » ఎంఎస్ ధోని దగ్గరికి వస్తే పట్టించుకోని రకుల్ ప్రీత్.. తప్పు చేసిందా?

ఎంఎస్ ధోని దగ్గరికి వస్తే పట్టించుకోని రకుల్ ప్రీత్.. తప్పు చేసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లోని అగ్రతారగా గుర్తింపు సంపాదించుకొన్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తొలుత బాలీవుడ్‌లోను, ఆ తర్వాత కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ భామకు అదృష్టం కలిసి రాలేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కిన తర్వాత టాలీవుడ్‌లో కెరీర్ రివ్వున దూసుకుపోయింది. ఆ తర్వాత అగ్రహీరోలతో నటించడమే కాకుండా వరుస హిట్లను తన ఖాతాలో జమ చేసుకొన్నది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో మరోసారి అదృష్టం పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నది.

వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్‌లో పాగా

వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్‌లో పాగా

2014లో యారియాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రూపంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొన్నది. ఇటీవల ఆమె నటించిన నాన్నకు ప్రేమతో, బ్రూస్ లీ రారండోయ్ వేడుక చూద్దాం, విన్నర్ చిత్రాలు ఆమెకు మంచి పేరు సంపాదించిపెట్టాయి. ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్‌బాబు సరసన స్పైడర్, బెల్లంకొండ శ్రీను పక్కన మరో చిత్రంలో నటిస్తున్నది.

టాలీవుడ్‌లో రాణిస్తూనే బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన రకుల్

టాలీవుడ్‌లో రాణిస్తూనే బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన రకుల్

ఇలా టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో జతకడుతూనే హిందీలో విజయవంతమైన, సంచలన చిత్రాలు అందించిన నీరజ్ పాండే చిత్రం ఐయారీ అనే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్‌లో తనకు ఇష్టమైన యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన జత కట్టే అవకాశాన్ని దక్కించుకొన్నది. ఈ చిత్రంలో రకుల్ ఐటీ ప్రొఫెషనల్‌గా నటిస్తున్నది.

సిద్ధార్థ్‌తో నటించడం చాలా హ్యాపీ

సిద్ధార్థ్‌తో నటించడం చాలా హ్యాపీ

ఈ సందర్భంగా రకుల్ మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో కొత్తతరం హీరోల్లో సిద్దార్థ్ ఒకరు. ఇటీవల ఆయన నటించిన చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. అలాంటి హీరోతో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఈ చిత్రంలో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి పనిచేయడం ఉత్సాహం కలిగిస్తున్నది అని రకుల్ తెలిపింది.

నీరజ్ పాండేతో కలిసి పనిచేయడం..

నీరజ్ పాండేతో కలిసి పనిచేయడం..

బాలీవుడ్‌లో తనకు రెండో చిత్రం షూటింగ్‌లో రకుల్ ఇటీవల పాల్గొన్నది. ఢిల్లీలో జరిగిన తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. త్వరలో ప్రారంభమయ్యే మరో షెడ్యూల్‌కు హాజరుకానున్నది. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. నీరజ్ లాంటి అగ్రదర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. గతంలో నీరజ్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయాను. కానీ ఈ సారి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొన్నాను అని రకుల్ వెల్లడించింది.

గతంలో ఎంఎస్ ధోనికి నో చెప్పాను..

గతంలో ఎంఎస్ ధోనికి నో చెప్పాను..

గతంలో ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో దిశాపటాని పోషించిన పాత్ర కోసం తొలుత నన్నే అడిగారు. కానీ తెలుగు పలు ప్రాజెక్టుల్లో నటిస్తుండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. ఇటీవల నీరజ్ పాండే చెప్పిన ఐయారీ చిత్ర కథ నాకు బాగా నచ్చింది. అందుకే ముందు వెనుక ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. ఈ సినిమా చాలా విభిన్నమైన కథాంశంతో కూడుకొన్నది అని రకుల్ పేర్కొన్నది.

English summary
Rakul Preet Singh is on could nine. The actor is working with her dream-director Neeraj Pandey, in his upcoming film, Aiyaary. And, starring alongside her in the project is her favourite, actor Sidharth Malhotra. Rakul was in Delhi recently, to shoot for her second Bollywood project, and will visit the city in the first week of July for another schedule. All praise for Neeraj Pandey for his brand of cinema. Her next Telugu film is AR Muragadoss’ SPYder, also starring popular actor Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu