ఆయనకు యాక్టింగ్ నేర్పించలేదు.. నేనేమైనా కోచింగ్ స్కూల్ పెట్టానా? రకుల్

వరుస విజయాలతో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. టాలీవుడ్‌లోనే కాదు.. తమిళ, హిందీ సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకొంటూ అగ్రతారగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం

By Rajababu

వరుస విజయాలతో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దూసుకెళ్తున్నది. టాలీవుడ్‌లోనే కాదు.. తమిళ, హిందీ సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకొంటూ అగ్రతారగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో భ్రమరాంబ పాత్రలో సినీ అభిమానులను ఆకట్టుకొన్న రకుల్ ప్రస్తుతం జానకిగా ప్రేక్షకులకు ముందుకు వస్తున్నది. రకుల్ నటించిన తాజా చిత్రం జయ జానకి నాయక. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. తాను నటిస్తున్న టాలీవుడ్, బాలీవుడ్, తమిళ చిత్రాల గురించి అందించి వివరాలు ఆమె మాటల్లోనే..

బోయపాటి వర్క్ చేయడం అంటే..

బోయపాటి వర్క్ చేయడం అంటే..

సరైనోడు సినిమా సందర్భంగా నేను బోయపాటి శ్రీనుతో వర్క్ చేశా. ఆయనతో వర్క్ చేయడంతోపాటు ఎంజాయ్ చేశాను. బోయపాటి సినిమాల్లో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే జయ జానకి నాయక చిత్రానికి ఓకే చెప్పాను. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగా ఉంటుంది. కొత్తగా కనిపిస్తాను. బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.

Recommended Video

Jaya Janaki Nayaka Teaser Review | Bellamkonda Sreenivas, Boyapati Sreenu
శ్రీనుకు క్రేజ్ పెరుగుతుంది..

శ్రీనుకు క్రేజ్ పెరుగుతుంది..

బెల్లంకొండ శ్రీను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాకు ముందు ఆయన క్రేజ్‌ కంటే దాదాపు 80 శాతం క్రేజ్ పెరుగుతుంది. సీనియర్‌గా శ్రీనుకు నేను ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. నేనేమైనా యాక్టింగ్ స్కూల్ ఓపెన్ చేశానా.. నటన నేర్పించడానికి. అంతకు ముందే శ్రీను రెండు సినిమాలు చేశాడు. అతనికి మంచి అనుభవం కూడా ఉంది. చక్కగా ఫైట్స్, యాక్షన్లలో నటించాడు. శ్రీను ఏంటో త్వరలోనే తెరపైన మీరే చూస్తారు.

బోయపాటి పాత్రలను బాగా డిజైన్ చేస్తారు..

బోయపాటి పాత్రలను బాగా డిజైన్ చేస్తారు..

బోయపాటి శ్రీను స్వయంగా ఓ యాక్టర్. చాలా వరకు సన్నివేశాలను షూట్ చేసేటప్పుడు ఆయన నటించి చూపిస్తాడు. ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్లు, ఎమెషన్ సీన్లు షూట్ చేసేటప్పడు సెట్‌ను ఆ వాతావరణంలోకి మార్చేస్తాడు. బోయపాటి సినిమాలో ఏ ఒక్క పాత్రైనా బాగాలేదని ఎవరూ చెప్పరు. ప్రతీ పాత్రను బాగా డిజైన్ చేస్తారు. అనుకున్న మేరకు తెరమీద ఫర్‌ఫెక్ట్‌గా చూపిస్తాడు.

టాలీవుడ్ అంటే ఇష్టం..

టాలీవుడ్ అంటే ఇష్టం..

తెలుగు సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ అంటే మరీ ఇష్టం. తమిళ, హిందీ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నానని అనడం తప్పు. ఎక్కడ మంచి సినిమా కథలు వస్తే వాటిని అంగీకరిస్తున్నాను. పవన్ కల్యాణ్‌తో సినిమా గురించి క్లారిటీ లేదు. ఇంకా ఒప్పుకోలేదు. చర్చల దశలోనే ఉంది. ప్రస్తుతం స్పైడర్, ఒక తమిళ, మరో హిందీ సినిమాలో నటిస్తున్నాను.

అలా ధోనిని వదులుకొన్నాను..

అలా ధోనిని వదులుకొన్నాను..

బ్రూస్‌లీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వలన ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంలో నటించలేకపోయాను. రిలీజ్ డేట్ దగ్గరపడిన సమయంలో అప్పుడు సాంగ్ షూట్ చేస్తున్నాను. అప్పుడు ధోని సినిమా అవకాశం వచ్చింది. మూడు రోజులు ఎలాగైనా కేటాయించాలని ప్రయత్నించాను. కానీ కుదర్లేదు.

నీరజ్ పాండే‌తో వర్క్ చేస్తున్నా..

నీరజ్ పాండే‌తో వర్క్ చేస్తున్నా..

ఇప్పుడు బాలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. ఐయారీ అనే చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా చిత్రంలో నటిస్తున్నాను. ధోని సినిమా వదులుకొన్నానని బాధపడుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండేతో పనిచేసే అవకాశం మళ్లీ వచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. బాలీవుడ్‌లో ఇంకా సినిమాలు అంగీకరించలేదు.

నాకు తొలి ఆడిషన్ చేసింది ఆయనే..

నాకు తొలి ఆడిషన్ చేసింది ఆయనే..

సినీ పరిశ్రమలోకి రావాలని ప్రయత్నిస్తూ కలిసిన మొట్టమొదటి వ్యక్తి నీరజ్ పాండే. 2011లో నా తొలి ఆడిషన్ ఆయనే చేశారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. ఆ సినిమా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ధోని వచ్చింది. కానీ కుదర్లేదు. ఇప్పుడు మళ్లీ నాకు ఐయారీ సినిమా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తాను అని రకుల్ చెప్పింది. యారీయాన్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినీ పరిశ్రమకు రకుల్ పరిచయమైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X